AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siri Hanmanth: ఎక్కువ టేకులు తీసుకున్నా అని అట్లీ అరిచారు.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ సిరి

ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులకు దగ్గరయింది. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది సిరి. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షోలోనూ కంటెస్టెంట్ గా వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతోపాటు.. గ్లామర్ తోనూ ఆకట్టుకుంది సిరి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో సిరి బిజీ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కేవలం యూట్యూబ్ కు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఊహించని విధంగా జవాన్ సినిమాలో మెరిసింది సిరి. 

Siri Hanmanth: ఎక్కువ టేకులు తీసుకున్నా అని అట్లీ అరిచారు.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ సిరి
Siri
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2023 | 11:59 AM

Share

బిగ్ బాస్ బ్యూటీ సిరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు ప్రేక్షకుల బాగా దగ్గరయింది. ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులకు దగ్గరయింది. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది సిరి. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షోలోనూ కంటెస్టెంట్ గా వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. బిగ్ బాస్ లో తన.దైన ఆట తీరుతోపాటు.. గ్లామర్ తోనూ ఆకట్టుకుంది సిరి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో సిరి బిజీ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కేవలం యూట్యూబ్ కు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఊహించని విధంగా జవాన్ సినిమాలో మెరిసింది సిరి.

టాలీవుడ్ లో సినిమాలు చేయకుండానే బాలీవుడ్ లో బడా మూవీలో ఛాన్స్ అందుకుంది ఈ చిన్నది.  సౌత్ సెన్సేషన్ అట్లీ దర్శకత్వంలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో షారుక్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో సిరి షారుక్ పక్కన చిన్న పాత్రలో నటించింది. తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ అందాల భామ.

ముందు జవాన్ సినిమాలో ఛాన్స్ గురించి ఫోన్ వచ్చినప్పుడు నేను ప్రాంక్ కాల్ అనుకున్నాను. ఆతర్వాత మేనేజర్ ఫోన్ చేసి నిజమే అని చెప్పారు అని తెలిపింది. ఫోన్ చేసి ఇలా అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిన్న రోల్ మీరు చేస్తారా అని అడిగారు. షూటింగ్ కు వెళ్లి సెట్ చూసేంత వరకు నేను అది నిజమని నమ్మలేదు. అక్కడ ఉన్నవారందరిని అడిగాను నిజంగా ఇది షారుక్ ఖాన్ సినిమానేనా అని. అట్లీ నన్ను తెలుగమ్మాయి అనుకోలేదు నార్త్ అమ్మాయి అనుకున్నారు. నేను ఒక్క డైలాగ్ కు ఏకంగా 7 టెక్స్ తీసుకున్నా దాంతో అట్లీ నా పై అరిచారు. అట్లీ అరవడంతో నేను చాలా ఏడ్చేశాను అని తెలిపింది సిరి. ఇక ముంబై తనకు కొత్త కావడంతో తన ఫ్రెండ్ శ్రీహాన్ తనకు సాయం చేశాడు అని తెలిపింది సిరి. ఇక జవాన్ సినిమా 850 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతుంది ఈ సినిమా. జవాన్ సినిమాలు హీరోయిన్ గా నయనతార, దీపికా పదుకొనె హీరోయిన్స్ గా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.