Bigg Boss 6 Telugu: “నువ్వు వేస్ట్ .. నీ పర్ఫామెన్స్ జీరో”.. ఆదిరెడ్డికి షాక్ ఇచ్చిన గీతూ

ఇక నిన్నటి ఎపిసోడ్ లో గీతూ మరోసారి ఓవర్ యాక్షన్ చేసింది. ఈసారి ఆదిరెడ్డిని టార్గెట్ చేసి మొహం మీదే నువ్వు వెస్ట్ అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చేసింది.

Bigg Boss 6 Telugu: నువ్వు వేస్ట్ .. నీ పర్ఫామెన్స్ జీరో.. ఆదిరెడ్డికి షాక్ ఇచ్చిన గీతూ
Geetu Royal, Adi Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 20, 2022 | 7:28 AM

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఆట తప్ప మిగిలిన సోది అంతా చేస్తున్నారు. నిన్ననే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లకు క్లాస్ తీసుకున్నారు. అయినా కూడా హౌస్ మేట్స్ లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గీతూ మరోసారి ఓవర్ యాక్షన్ చేసింది. ఈసారి ఆదిరెడ్డిని టార్గెట్ చేసి మొహం మీదే నువ్వు వెస్ట్ అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆట సరిగ్గా ఆడటం లేదని హౌస్ లో ఉన్న వాళ్లకు గడ్డి పెట్టి ఫుడ్ కట్ చేశాడు బిగ్ బాస్. గీతూ ఆది రెడ్డి ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో కూడా రివ్యూలు ఇచ్చుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎప్పుడు చూసిన వాళ్ళు సరిగ్గా ఆడలేదు.. వేళ్ళు సరిగ్గా ఫెర్ఫామ్ చేయలేదు అంటూ రివ్యూలు ఇవ్వడమే కానీ వీళ్ళు ఆడింది పెద్దగా కనిపించలేదు. నిన్నటి ఎపిసోడ్ లోనూ అదే జరిగింది. అయితే ఇన్నిరోజులు పక్కనే ఉన్న ఆదిరెడ్డికే ఎసరు పెట్టింది గీతూ..

ఆదిరెడ్డికి కూలీనెం.1లో సినిమాలో వెంకటేష్  పాత్ర ఇచ్చారు. నిజానికి మనోడు నటుడు కాదు కాబట్టి అంతగా ఈ పాత్రతో ఆకట్టుకోలేకపోయాడు. అలాగే గీతుకి అయితే పుష్పలో శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చారు. ఆమె ఎప్పటిలానే ఓవర్ యాక్టింగ్ చేసింది. అయితే ఈ ఇద్దరు కలిసి స్విమింగ్ పూల్ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు.  గీతూ మాట్లాడుతూ.. “నామినేషన్స్‌లో ఉన్నారు అందరూ.. ఇప్పుడు కూడా పెర్ఫామ్ చేయట్లేదు.. ఇలాగైతే ఫేమ్ ఉన్న వాళ్లు ఉండి.. లేని వాళ్లు ఎలిమినేట్ అయిపోతారు’ అని చెప్పింది. అలాగే ఆదిరెడ్డి గురించి కూడా మాట్లాడింది..

‘ఈ సీజన్‌లో అంతా తుప్పాస్ కంటెస్టెంట్స్ వచ్చారు’ అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ తరువాత  ‘నువ్ సరిగా పెర్ఫామ్ చేయట్లేదు ఆదిరెడ్డీ.. ఉదయం ఏదో ఓ గంట చేశావ్.. తరువాత ఏం చేశావ్.. నువ్ నన్ను డిజప్పాయింట్ చేశావ్ ఆదిరెడ్డీ.. నువ్ బిగ్ బాస్‌ని డిజప్పాయింట్ చేశావో లేదో నాకు తెలియదు కానీ.. నన్నుమాత్రం మాత్రం చేశావ్. నాకు భయం వేస్తుంది ఆదిరెడ్డీ.. ఎక్కడపోతావ్ అనీ.. నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యే వాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే “నాకు భయంగా ఉంది. నా వల్ల నువ్ సేవ్ అవుతావ్.. అది పక్కన పెడితే.. నీ వల్ల ఎంటర్ టైన్ చేసేవాళ్లు ఎవరైనా వెళ్లిపోతే నేను బాధపడతా? నీ దగ్గర ఎంటర్ టైన్మెంట్ జీరో.. టాస్క్‌లలో కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి. నువ్వేం చేయడం లేదు.. జీరో.. ఏదోటి చేయాలి. అదే కదా కామెడీ అని అన్నది. మొత్తానికి అదిరెడ్డిని పక్కనే కూర్చొని నువ్వు ఆడటంలేదు అంటూ చెప్పేసింది. ఇప్పటికైనా మనోడు గీతూ నమ్ముకోవడం మానేసి ఆట మీద దృష్టి పెడతాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!