Prabhas: ప్రభాస్, మారుతి మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్.. కీలక పాత్రలో ఆ బాలీవుడ్ నటుడు..
ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్ కేలను ఇప్పటికే పట్టాలెక్కించారు...
ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్ కేలను ఇప్పటికే పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమాలు ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే వీటితో ప్రభాస్ మారుతో దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో బొమన్ ఇరానీ నటించనున్నారని సమాచారం. ఓ కీలక పాత్రలో ఇరానీని తీసుకోవాలని మారుతి ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక మారుతి చిత్రాన్ని ప్రాజెక్ట్ కే పూర్తి చేసిన తర్వాత పట్టాలెక్కించాలని ప్రభాస్ ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ ప్రభాస్ ఫొటోషూట్‌ను పూర్తి చేసింది. కామెడీ, హర్రర్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ప్రభాస్‌లాంటి స్టార్ హీరో మారుతికి అవకాశం ఇవ్వడం అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. మరి ప్రభాస్ నమ్మకాన్ని మారుతి ఏమేర నిలబెడతారో తెలియాలంటే కనీసం మరో రెండేళ్లు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..