హిమజ.. ఇటు బుల్లితెర, అటు వెండితెరపై సత్తాచాటుతున్న ప్రముఖ నటి. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఈ అందాల తార ‘సర్వాంతర్యామి’ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం- కొంచెం కష్టం లాంటి ధారవాహికల్లో చీరకట్టుతో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత రామ్ ‘శివమ్’ సినిమాతో వెండితెరపై కూడా అడుగుపెట్టింది. ‘నేను శైలజ’లో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. ఆపై ‘జనతా గ్యారేజ్’, ‘ధృవ’, ‘మహానుభావుడు’, ‘శతమానం భవతి’, ‘స్పైడర్’, ‘వినయ విధేయ రామ’, ‘చిత్రలహరి’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే బిగ్‌బాస్ సీజన్3లో కంటెస్టెంట్‌గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది హిమజ. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సినిమాలు, ఈవెంట్లు, కమర్షియల్ ప్రమోషన్లతో బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తోందీ బిగ్ బాస్ బ్యూటీ. ఇప్పటికే రెండు కార్లు కొన్న హిమజ తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. తన సంపాదనతో నిర్మించుకున్న నాలుగంతస్తుల ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈక్రమంలో తన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి.
లక్ష్మీదేవి చిత్రపటాన్ని పట్టుకుని కొత్త ఇల్లు గుమ్మం లోపల పెట్టి కొత్త ఇంటిలోకి అడుగుపెడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హిమజ..’గృహప్రవేశం.. జ్ఞాపకాల కోసం నిర్మించుకున్న ప్రదేశం ఈ కొత్త ఇల్లు. నా కలలు సాకారమయ్యాయి. ఈ మైలురాయిని అందుకున్నందుకు నాకు నేను అభినందనలు తెలుపుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది. దీంతో . అరియానా గ్లోరీ, సిరి హనుమంతుతో సహా పలువురు బుల్లితెర నటీనటులు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హిమజకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..