
బిగ్ బాస్ సీజన్ 9లో రచ్చ రచ్చగా సాగిస్తుంది. రెండో వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. ముఖ్యంగా హౌస్ లోని సభ్యులు అందరూ హరిత హరీష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రెండో వారం నామినేషన్స్ లో హరిత హరీష్ ను టార్గెట్ చేసి చాలా మంది నామినేట్ చేశారు. ముఖ్యంగా రీతూ చౌదరి హరీష్ పై విరుచుకుపడింది. నువ్వు గివప్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని రీతూ చెప్పుకొచ్చింది. నేను నీకోసం రాలేదు అంటూ హరీష్ రెచ్చిపోయాడు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. రీతూ గట్టిగానే వాదించింది. గివప్ ఇచ్చేసి నేను తినను నేను ఇలాగే ఉంటాను నేను వెళ్లిపోతాను అని గివ్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు అని రీతూ చెప్తే.. దానికి గట్టిగానే వాదించాడు హరీష్.. నాకు నచ్చిన మనుషులు బయటున్నారు.. వాళ్లకి నచ్చినట్లు ఉంటా..అంటూ హరీష్ చెప్పుకుకొచ్చాడు.
రీతూ ఓ వైపు ఏడుస్తుంటే మీరు ఏడ్చి ఏదైనా ప్రూ చేయాలనుకోకండి అని హరీష్ కౌంటర్ ఇచ్చాడు. ఏడ్చి ప్రూ చేయాల్సిన అవసరం నాకు లేదు.. అని రీతూ.. సింపథీ విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయొద్దు.. అంటూ హరీష్ అరిచాడు. ఈ గొడవ చాలా సేపు సాగింది. ఆతర్వాత దమ్ము శ్రీజ రంగంలోకి దిగింది. శ్రీజ కూడా హరీష్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. సంజన గారిని నా ఓన్ రీజన్స్‌తో నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను.. చేశాను.. గేమ్ అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడలేదు .. శ్రీజతో మాట్లాడను ఆమె మీద చాలా కోపంగా ఉన్నాను అని చెప్పారట.. అది నాకు నచ్చలేదు. చాలా సార్లు నీ వల్లే అయింది నీ వల్లే ఇదంతా జరిగింది అని నా గురించి డైలాగ్స్ వేశారు.. అది నాకు నచ్చలేదు..
అలాగే ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుందని మీరే అంటుంటారు. ఆ క్లిప్ చూపించినప్పుడు అందరూ మీరు ఇమ్మూ ని కావాలని అన్నారని అర్థమవుతుంది.. కానీ ప్రియ, ఇమ్మానుయేల్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏం ఆ కాంటెస్ట్‌లో ఆయన్ని ఉద్దేశించి అనలేదు..అంటూ మట మార్చేశారు హరీష్. కానీ ఆ వీడియోలో మీరు ఇమ్మూని రెడ్ ఫ్లవర్ అన్నది క్లియర్‌గా ఉంది.. అని చెప్పింది. అంటే బాడీ షేమింగ్ చేశానని నన్ను ఇరికిస్తున్నారు అని హరీష్ అన్నాడు. అలాగే మీకు తెలీకుండా రెడ్ ఫ్లవర్ అనేశారు కదా.. అలానే అతను వద్దన్నా కూడా మీరు బాడీ షేమింగ్ చేశారు.. అంటూ శ్రీజ చెప్పింది. దానికి హరీష్ కౌటర్ వేశాడు. మీకు ఇరిటేషన్, బాడీ షేమింగ్‌కి తేడా తెలీనప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పక్కర్లేదు అని చెప్పుకొచ్చాడు హరీష్. ఆతర్వాత ఇలాంటోళ్ల దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదని హరీష్ అనగానే మరి వెళ్లిపోండి అని శ్రీజ పంచ్ ఇచ్చింది. అయితే పంపిస్తే వెళ్లిపోతాం.. దమ్ముంటే అడగండి బిగ్‌బాస్‌ని అని రెచ్చిపోయాడు హరీష్. దాంతో తనూజ, రీతూ రియక్ట్ అయ్యారు. మాటలు మంచిగా మాట్లాడండి.. దమ్ముంటే అంటున్నారు. అంటే బిగ్ బాస్ కు దమ్ములేదు అంటున్నారా.? అంటూ రెచ్చిపోయారు. దమ్ముంటే ఇక్కడికొచ్చి మాట్లాడండి..అంటూ హరీష్ సీరియస్ అయ్యాడు. దమ్ము గురించి మాట్లాడటం కాదు ఫస్ట్ ఒక ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి అంటూ ఇద్దరూ హరీష్ పై మండిపడ్డారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.