BiggBoss 9 Telugu :దత్తపుతిక మామూల్ది కాదు.. దెబ్బకు కన్నీళ్లుపెట్టుకున్న ఇమ్మాన్యుయేల్..
బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు 12వ వారంలో అందరూ ఊహించినట్టుగానే దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యింది. కామనర్ గా సెప్టెంబర్ 12న వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది.

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. గతవారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ పై ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. హౌస్ మేట్స్ ఆట తీరుపై నాగార్జున మండిపడ్డారు. అలాగే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో దివ్య ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. టాప్ 5లో ఉంటుందన్న దివ్య ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన దివ్యకు చుక్కలు చూపించాడు శివాజీ. బిగ్ బాస్ బజ్ షోలో తన ప్రశ్నలతో దివ్యను ఆడేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు నామినేషన్స్ టైమ్ వచ్చింది. ఈ రోజు నామినేషన్స్ గరం గరంగా ఉండనున్నాయి.
10ప్లాప్స్ రెండే రెండు హిట్స్.. అందంలో దేవకన్య ఈ వయ్యారి భామ.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మరోసారి రీతూ చౌదరికి, సంజనకు మధ్య గొడవైందని తెలుస్తుంది. గతవారం సంజన నోరు జారీ అన్న మాటలకూ రీతూ తెగ ఏడ్చేసింది. అలాగే సంజన కూడా ఎక్కడా తగ్గలేదు. అవసరమైతే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆతర్వాత హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం అనే హౌస్ లోనే కొనసాగింది. ఇక నేడు నామినేషన్స్ లోనూ మరోసారి సంజనకు, రీతూకి గొడవ జరిగింది. మరోసారి అదే పాయింట్ తో సంజను నామినేట్ చేసింది రీతూ..
అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?
ఆతర్వాత తనూజ ఇమ్మానుయేల్ ను నామినేట్ చేసింది.”నాకేమైనా అనిపిస్తే నా మైండ్‌లో ఏమైనా తిరుగుతుంటే నేను షేర్ చేసుకోవాలి.. వాడితోనే చెప్పుకున్నా.. ఎందుకంటే వాడే కదా నా ఫ్రెండ్.. అంటూ తనూజ ఎమోషనల్ అయ్యింది. ఆతర్వాత ఇమ్మాన్యుయేల్ కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు.. “నువ్వు నాతో ఎంత ట్రూగా ఉన్నావో నేను నీ విషయంలో కూడా అంతే ట్రూగా ఉన్నాను.. అది నీకు ఎందుకు తెలీలేదో నాకు అర్ధంకావడంలేదు.. అదే నన్ను హర్ట్ చేసింది.. నువ్వు నా ఫ్రెండే కాదురా అనేశావ్ నా ముఖం మీద.. తనూజ నువ్వు ఏమైనా అంటే దాన్ని నుంచి బయటికి రావడానికి నాకు టైమ్ పడుతుంది.. ప్లీజ్ మన ఇద్దరకీ గొడవలు వద్దనే చెప్పాను నీకు ఆరోజు కూడా చెప్పాను.. అంటూ ఇమ్మాన్యుయేల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఎప్పటికీ చెప్తా నువ్వు నా ఫ్రెండే.. అంటూ తనూజ అంది. ఆతర్వాత ట్విస్ట్ ఇచ్చింది. ఇక నా ఫస్ట్ నామినేషన్ డీమన్ పవన్ అని చెప్పింది. అదేంటి ఇప్పటివరకు జోక్ చేశావా.? అని డీమన్ అనగానే.. అది జోకో, గీకో బిగ్ బాస్ చెప్తాడు అని తనూజ రివర్స్ అయ్యింది.
మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




