
బిగ్‍బాస్ సీజన్ 9లో కామనర్ ఎంట్రీగా అడుగుపెట్టి టాస్కులలో ఆడపులిగా చెలరేగింది దమ్ము శ్రీజ. తన ఆట తీరుతో జనాలకు దగ్గరయ్యింది. కానీ ఊహించని విధంగా అడియన్స్ ఓటింగ్ తో సంబంధమే లేకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీల నిర్ణయంతో శ్రీజను ఎలిమినేట్ చేశారు. దీంతో ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని..తనకు రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో శ్రీజను రీఎంట్రీ తీసుకువస్తున్నట్లు హడావిడి చేశారు బిగ్‍బాస్ . కానీ ఆమెతో పాటు భరణి సైతం రీఎంట్రీ ఇస్తున్నాడని.. ఎవరైతే టాస్కులలో విజేతలుగా నిలుస్తారో వారికే మరోసారి హౌస్ లోకి ఛాన్స్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. గత వారం రీఎంట్రీ పేరుతో పెద్ద తతంగమే నడిచింది. దమ్ము శ్రీజ, భరణి ఇద్దరిని తిరిగి తీసుకువచ్చి కొన్ని టాస్కులు పెట్టి హడావిడి చేశారు. చివరకు అడియన్స్ ఓటింగ్ అంటూ మెలిక పెట్టారు. చివరకు భరణికి ఎక్కువ ఓటింగ్ వచ్చిందంటూ శ్రీజను మరోసారి ఎలిమినేట్ చేశారు. తాజాగా బిగ్‍బాస్ పై సంచలన కామెంట్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది శ్రీజ దమ్ము.
ఆ వీడియోలో శ్రీజ మాట్లాడుతూ.. ” నన్ను ఎలమినేట్ చేసిన విధానం నాకు చాలా బాధగా అనిపించింది. స్టేజ్ మీదకు వెళ్లేవరకు నాకు ఏం అర్థం కాలేదు. ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారేమో.. లేదా నన్ను సీక్రెట్ రూంలో పెడుతున్నారేమో అనుకున్నాను. కానీ వెంటనే బజ్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి షాకిచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. తర్వాత బిగ్‍బాస్ ఎపిసోడ్స్ కూడా ఏం చూడలేదు. మళ్లీ బిగ్‍బాస్ టీమ్ వాళ్లే ఇలా నామినేషన్స్ చేయడానికి హౌస్ లోకి వెళ్లాలి రమ్మని పిలిచారు. వెళ్లేవరకూ మాకూ రీఎంట్రీ ఉందని చెప్పలేదు. తర్వాత హోటల్లో ఉండగా రీఎంట్రీ ఉంటుందని అన్నారు.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
కానీ తీరా స్టూడియోకు వెళ్లాక అక్కడ భరణి గారు ఉండడం చూసి షాకయ్యాను. నన్ను అడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశఆరు. అందుకే నన్ను పిలిచారు అనుకున్నాను. కానీ భరణి గారిని ఎందుకు రీఎంట్రీకి పిలిచారు.. అలా అయితే మిగిలిన వాళ్లను కూడా పిలవాలి కదా.. మేము ఇద్దరం లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్లు భరణి గారికి హింట్ ఇచ్చారు. ఈసారైనా గేమ్ బాగా ఆడండి. మీరు ఉంటారు కాబట్టి అన్నారు. అప్పుడే నేను అనుకున్నా నన్ను మళ్లీ పంపిస్తారని. అలాగే జరిగింది. నా ఎలిమినేషన్ వల్ల వచ్చిన మరకను వదిలించుకోవడానికి నన్ను మళ్లీ పిలిచి నాటకం ఆడారు. భరణి రీఎంట్రీ కోసం నన్ను బలి పశువును చేశారు. కనీసం రెండోసారి కూడా ఎలాంటి ఏవీ లేకుండా నన్ను పంపించేశారు. ఇది న్యాయమా.. నా జర్నీ వీడియో మాత్రం ఇవ్వండి చాలు” అంటూ భావోద్వేగానికి గురైంది.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..