Bigg Boss 9 : ఆమె జస్ట్ మిస్.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం అతను అవుట్.?

హౌస్‌లో చిన్న చిన్న ఫైట్స్, ఎమోషనల్ మూమెంట్స్ కొనసాగాయి. బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓనర్లు-టెనెంట్ల మధ్య టాస్క్ లు పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ కు రీతూ చౌదరిని సంచలక్ గా పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్ కొత్త కెప్టెన్ కోసం “టైమర్ టాస్క్” ఇచ్చాడు.

Bigg Boss 9 : ఆమె జస్ట్ మిస్.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం అతను అవుట్.?
Bigg Boss 9.

Updated on: Sep 19, 2025 | 9:49 AM

బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్స్ కాస్త గట్టిగానే జరిగాయి. ఈవారం హౌస్ లో మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా శెట్టి, డిమాన్ పవన్, భరణి కుమార్, ఫ్లోరా సైని నామినేషన్స్ లో ఉన్నారు. గత వారం ఊహించని విధంగా శ్రష్టి వర్మ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నామినేషన్స్ సమయంలో హౌస్ మేట్స్ మధ్య ఓ రేంజ్ లో గొడవలు జరిగాయి. ముఖ్యంగా హరిత హరీష్ కు హౌస్ మేట్స్ కు మధ్య గట్టిగానే వాదన జరిగింది. దమ్ము శ్రీజ, తనూజ, రీతూ చౌదరి హరీష్ పై గట్టిగానే గొడవేసుకున్నారు..

ఈ స్టార్ హీరో అమ్రీష్ పురి మనవడా..! బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడుగా

ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. డిమాన్ పవన్ రెండో వారం కెప్టెన్ అయ్యాడు. కాబట్టి అతను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి. ఇక హౌస్ లో ప్రేక్షకులు ఎక్కువగా ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారు అంటే అది సుమన్ శెట్టి అనే చెప్పాలి. సుమన్ శెట్టి హౌస్ లో తనపని తాను చేసుకుంటూ పోతున్నా.. టాస్క్ ల సమయంలో సాయశక్తుల ప్రయతిస్తున్నాడు. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లోనూ సుమన్ శెట్టి గట్టిగానే పోటీ పడ్డాడు. ఓటింగ్ లోనే సుమన్ శెట్టి ముందంజలో ఉన్నాడు.

ఫస్ట్ నైట్‌ను వీడియో తీసుకున్న భర్త.. కట్ చేస్తే ట్విస్ట్.. అప్పుడే అసలు సినిమా మొదలు.. ఎక్కడ చూడొచ్చంటే

ఆతర్వాత భరణి కూడా హౌస్ లో జన్యున్ గా అనిపిస్తున్నాడు. టాస్క్ ల్లోనూ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రేక్షకుల మద్దతు కూడా గట్టిగానే ఉంది.. హరిత హరీష్, ఫ్లోరా షైనీకి పర్లేదు.. ఈ ఇద్దరికీ కూడా మంచి ఓట్లు పడుతున్నాయి. ఇక మిగిలింది ప్రియా శెట్టి, మర్యాద మనీష్.. ఈ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రియా శెట్టికి తక్కువ ఓట్లు పడుతున్నాయి. నేటితో ఓటింగ్ ముగుస్తుంది. కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కాగా మనీష్ కంటే ప్రియకు కొన్ని ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. దాంతో ఆమె ఈవారం సేఫ్ అయ్యేలా కనిపిస్తుంది. కాగా మనీష్ హౌస్ నుంచి అవుట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా రామ్ చరణ్‌కు తల్లిగా.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.