Bigg Boss 9: సంజనకు స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్.. షాక్‌లో కామనర్స్
బిగ్ బాస్ సీజన్ 9లో డే 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. రోజు రోజుకు హౌస్ మేట్స్ మధ్య రచ్చ మాములుగా జరగడం లేదు. ముఖ్యంగా సామాన్యులకు, సెలబ్రెటీలకు మధ్య కాస్త గట్టిగానే జరుగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సంజనకు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు . దాంతో సామాన్యులంతా షాక్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో డే 4 రచ్చ రచ్చగా సాగింది. కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అసలైన అట మొదలు పెట్టారు. నిజం చెప్పాలంటే సామాన్యులంటే సెలబ్రెటీలకే సింపథీ ఎక్కువ వస్తుంది. ప్రత్తిసీజన్ లో సెలబ్రెటీలు రెచ్చిపోయేవారు.. సామాన్యులు సైలెంట్ గా ఉండేవారు. కానీ ఈ సీజన్ లో అంతా రివర్స్ గా ఉంది. సామాన్యులే సెలబ్రెటీల రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. హౌస్ లో ఉన్న సెలబ్రెటీలను చూస్తుంటే ప్రేక్షకులకు జాలేస్తుంది. మొన్నటి ఎపిసోడ్ లో మర్యాద మనీష్ కాస్త ఓవర్ గా ప్రవర్తించాడని అనిపించింది. ముఖ్యంగా రాము రాథోడ్ తో అతను మాట్లాడిన తీరు బాలేదని ప్రేక్షకులు అంటున్నారు. నిన్న కూడా మర్యాద మనీష్ తీరు ప్రేక్షకులకు ఇబ్బందిగానే అనిపించింది.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో సంజనాను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు. సంజనాను హౌస్ లో ఉన్నవారు ఎలా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటూ ప్రశ్నలు అడిగాడు బిగ్ బాస్. దాంతో సంజన ఓపెన్ గా చెప్పేసింది. ఎవరి గేమ్ వాళ్లు అడుగుతున్నారు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకలా ఉంటున్నారు. నేను మాత్రం నాలానే ఉంటున్న.. నా మైండ్ లో ఏది ఉంటే అదే మాట్లాడుతున్నా.. అందుకే నేను మోస్ట్ ఫేవరెట్ నామినేషన్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది సంజన. అలాగే హౌస్ లో ఉన్నవారు మిమ్మల్ని కార్నర్ చేశారని మీకు అనిపిస్తుందా.? అని ప్రశ్నించగా.. అలాగే అనిపిస్తుంది బిగ్ బాస్ అని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది నన్ను నామినేట్ చేయడం నాకు బాధగా అనిపించింది. నాకు లోపల ఎంత పెయిన్ ఉన్నాకూడా నేను నవ్వి చూపించాలి. అదే నా ఛాలెంజ్. సంజన మాటలకు బిగ్ బాస్ కూడా ఫిదా అయ్యాడు. అందరూ ఇక్కడ నిజాన్ని దాచాలని చూస్తారు. కానీ మీరు మాత్రం నిర్భయంగా మాట్లాడారు అని ఆమెను అభినందించాడు బిగ్ బాస్.. ఆతర్వాత నా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు. బాగున్నారా.? అది ఒక్కటి చెప్పండి బిగ్ బాస్ అని సంజన ఎమోషనల్ అయ్యింది. అందరూ బాగున్నారు. మీరు గేమ్ మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు బిగ్ బాస్. ఆతర్వాత సంజనాలు ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి క్యాప్టెన్సీ కోసం పోటీ పడటానికి ఓ ఐదుగురి పేర్లు చెప్పండి. మీరు చెప్పిన వారిలో ఒకరు కెప్టెన్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే ఆ లిస్ట్ లో ఇద్దరు ఓనర్లు ఉండాలి అని చెప్పాడు. దాంతో సంజన, హరీష్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్, శ్రష్టి పేర్లు చెప్పింది. ఆతర్వాత బయకు వచ్చి అందరి ముందు ఆ పేర్లు అనౌన్స్ చేయండి అని బిగ్ బాస్ చెప్పాడు. బయటకు వచ్చి సంజన ఐదుగురి పేర్లు చెప్పింది. దాంతో మా పేర్లు ఎందుకు చెప్పలేదు అంటూ కామనర్స్ గొడవ మొదలు పెట్టరు. దాంతో నాకు క్లోజ్ అయినవారిని సెలక్ట్ చేశా అని స్ట్రాంగ్ గా చెప్పేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




