Bigg Boss 8 : అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కున్నా.. వెక్కి వెక్కి ఏడ్చినా మణికంఠ

నేను ఒక్కో పాయింట్‌కి ఆన్సర్ చేస్తా.. నాకు అంత జ్ఞాపకశక్తి లేదు.. నేను 7వ తరగతి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను.. మా నాన్నను పోగొట్టుకున్నాను.. స్టేప్ ఫాదర్ చేత ఎన్నో అవమానాలు పడ్డా.. నా అమ్మ చనిపోయింది.. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కున్నా..

Bigg Boss 8 : అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కున్నా.. వెక్కి వెక్కి ఏడ్చినా మణికంఠ
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 05, 2024 | 10:06 AM

నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ కంటిన్యూ చేశారు హౌస్‌మేట్స్. ఇక నాగమణికంఠను ప్రేరణ నామినేట్ చేసింది. మణికంఠ ఎవరితోనూ పెద్దగా కలవడంలేదు అని నామినేట్ చేసింది ప్రేరణ. గొడవ పెట్టుకునేటప్పుడు ఉండే కాన్సట్రేషన్ అందరితో కలవడానికి పెట్టుకుంటే బావుండేది అంటూ నామినేట్ చేసింది ప్రేరణ. ఆమె తన రీజన్  చెప్పడంతో మణికంఠ ఎమోషనల్ అవ్వడం మొదలుపెట్టాడు. అతను మాట్లాడుతూ.. నేను ఒక్కో పాయింట్‌కి ఆన్సర్ చేస్తా.. నాకు అంత జ్ఞాపకశక్తి లేదు.. నేను 7వ తరగతి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను.. మా నాన్నను పోగొట్టుకున్నాను.. స్టేప్ ఫాదర్ చేత ఎన్నో అవమానాలు పడ్డా.. నా అమ్మ చనిపోయింది.. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కున్నా.. ఆ డబ్బులతో కట్టెలు పేర్చాను.. నా భార్య దూరమైంది.. నా కూతుర్ని దూరం చేస్తుంది.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా గురించి ఏం తెలుసని మీరు క్లాప్స్ కొడుతున్నారు.. అంటూ ఏడ్చేశాడు.

మణికంఠ తన ఎమోషనల్ జర్నీ చెప్పగానే హౌస్ లో ఉన్న లేడీస్ మొత్తంవెక్కి వెక్కి ఏడ్చారు. ప్రేరణ, యష్మీ, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా యష్మీ అయితే సీట్ లో కూర్చొని వెక్కి వెక్కి ఇచ్చేసింది. సరే ఇక ఇప్పుడు ఓపెన్ అయ్యారు కదా.. ఇక నుంచైనా అందరితో కలవండి అని ప్రేరణ అంది. దాంతో మరో డైలాగ్ కొట్టాడు నేను ఎవరనీ నమ్మలేను.. మనుషుల మీద, మానవత్వం మీదే నాకు నమ్మకం పోయింది అని అన్నాడు మణికంఠ.

ఆతర్వాత ఆడవాళ్ళందరూ కలిసి మణికంఠను ఓదార్చారు. మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. తనలో ఫెమినిటీ ఉందంటూ విష్ణుప్రియ చెప్పడం తనకి నచ్చలేదని చెప్పాడు మణికంఠ. నిన్ను చెక్ చేయడానికే ఈ థ్రీ డేస్ నీతో క్లోజ్‌గా ఉన్నా అంటూ మణికంఠ చెప్పడంతో విష్ణు ప్రియా షాక్ అయ్యింది. నువ్వు జెన్యూన్ అనుకున్నా కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావ్ అంటూ ఏడ్చింది. తన రెండో నామినేషన్ శేఖర్ బాషాకి వేశాడు మణికంఠ. వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే ఎవడికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్.. ఓ వచ్చి ఏడ్చేసి.. దాన్ని నుంచి సింపథీ తెచ్చేసుకొని.. పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు శేఖర్ బాషా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి