AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu : మెగా చీఫ్‌గా నబీల్ అఫ్రిదీ.. బోరున ఏడ్చేసిన యష్మీ

హౌస్‌లో ఉన్న వారందరికీ కలిపి మెగా చీఫ్ అంటూ ఒకరే ఉంటారంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో నబీల్ అఫ్రిదీ విన్ అయ్యి మెగా చీఫ్ అయ్యాడు. పృథ్వీపై నబీల్ అఫ్రిది చివరి నిమిషంలో విన్ అయ్యారు. పృథ్వీ ఓడిపోయినందుకు సంచలక్ గా ఉన్న ప్రేరణయే కారణమని..

Bigg Boss 8 Telugu : మెగా చీఫ్‌గా నబీల్ అఫ్రిదీ.. బోరున ఏడ్చేసిన యష్మీ
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Oct 04, 2024 | 8:19 AM

Share

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపేందుకు హౌస్ మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో చాలా రచ్చ జరిగింది. హౌస్‌లో ఉన్న వారందరికీ కలిపి మెగా చీఫ్ అంటూ ఒకరే ఉంటారంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో నబీల్ అఫ్రిదీ విన్ అయ్యి మెగా చీఫ్ అయ్యాడు. పృథ్వీపై నబీల్ అఫ్రిది చివరి నిమిషంలో విన్ అయ్యారు. పృథ్వీ ఓడిపోయినందుకు సంచలక్ గా ఉన్న ప్రేరణయే కారణమని.. కావాలని హెల్ప్ చేయలేదంటూ యష్మీ మాట్లాడింది. బిగ్‌బాస్ పెట్టిన పప్పీల టాస్కు నిన్న కూడా జరిగింది. ఈ గేమ్ లో నబీల్, నిఖిల్, ప్రేరణ, ఆదిత్య పాల్గొన్నారు. కాగా ప్రేరణ, ఆదిత్య డేంజర్ జోన్ లో ఉన్న వీరి నుంచి ఒకరిని తప్పించి ఒకరిని సేవ్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్. దాంతో నైనికా ప్రేరణను సేవ్ చేసింది.

ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్

ఆతర్వాత నబీల్, నిఖిల్, ప్రేరణ పప్పీ టాస్కు ఆడారు. ఈ గేమ్ లో నిఖిల్, ప్రేరణ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకరిని డిసైడ్ చేయాలనీ ఆదిత్యకు చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఆదిత్య ప్రేరణను సేవ్ చేశాడు. నేను నిఖిల్‌ లీడర్ షిప్ చూశాను.. కానీ ఈ హౌస్‌కి ఒక ఫీమేల్ లీడర్‌ను చూడాలని ఉంది.. అంటూ ఆదిత్య అన్నాడు. ఇక చివరకు ప్రేరణ-నబీల్‌ మిగిలారు. ఈ ఇద్దరిలో చీఫ్ కంటెండర్ అయ్యేందుకు ఒకరిని ఎంచుకోమని హౌస్ లో ఉన్న అందరికి చెప్పాడు బిగ్ బాస్.

ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి

దాంతో ఇద్దరూ హౌస్‌మెట్స్‌కి తమ వెర్షన్ చెప్పుకున్నారు. దాంతో హౌస్ మేట్స్ బాగా ఆలోచించారు. ఎక్కువ మంది నబీల్‌కి సపోర్ట్ చేయడంతో చీఫ్ కంటెండర్‌గా అతను సెలక్ట్ అయ్యాడు. చీఫ్ కంటెండెర్స్‌ అయిన నబీల్-పృథ్వీలకి బిగ్‌బాస్ టాస్కు ఇచ్చాడు. బ్లాక్స్‌ను సరైన సెంటైన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్‌లో పెట్టాలి అనే టాస్క్ ఇచ్చాడు. సెంటైన్స్ ఫామ్ అయ్యేలా పెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. వాటిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఉన్న అయినా వారే మెగా చీఫ్ అని చెప్పాడు బిగ్ బాస్. I am Mega Chief అనే సెంటైన్స్ ఫామ్ అయ్యేలా బాక్స్ లు పెట్టాలి. ఈ టాస్క్ లో నబీల్ విన్ అయ్యాడు. పృథ్వీ ఓడిపోయినందుకు యమ్మీ యష్మీ తెగ ఏడ్చేసింది. పృథ్వీ ఓడిపోయినందుకు ప్రేరణయే కారణమంటూ యష్మీ తెగ బాధపడింది. ప్రేరణ దగ్గర కూడా నువ్వు హెల్ప్ చేసి ఉండాల్సిందంటూ యష్మీ వాదన పెట్టుకుంది.

ఇది కూడా చదవండి : Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us