Bigg Boss 7 Telugu: రూమ్ షేరింగ్.. పాపం టేస్టీ తేజకు అన్యాయం జరిగిందిగా..
ఇందుకోసం రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి , ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. కాగా ఈ నామినేషన్స్ ప్రక్రియ మంచి రసవత్తరంగా సాగింది. ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటూ.. వాదించుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై అందరూ ఎగబడ్డారు. రైతు బిడ్డ అనే సింపతీ వాడుతున్నాడు అంటూ అమర్ దీప్, గౌతమ్ కృష్ణ ఫైర్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 13 మంది ఉన్నారు. పోయిన వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు హౌస్ లో 13 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సందీప్ బిగ్ బాస్ పవర్ అస్త్ర సొంతం చేసుకొని హౌస్ మేట్ గా కంటిన్యూ అవ్వనున్నాడు. ఇక మిగిలిన వారిలో ఎవరు హౌస్ మేట్స్ గా ఉండనున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి , ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. కాగా ఈ నామినేషన్స్ ప్రక్రియ మంచి రసవత్తరంగా సాగింది. ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటూ.. వాదించుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై అందరూ ఎగబడ్డారు. రైతు బిడ్డ అనే సింపతీ వాడుతున్నాడు అంటూ అమర్ దీప్, గౌతమ్ కృష్ణ ఫైర్ అయ్యారు.
ఆతర్వాత శివాజీ , శోభా శెట్టి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. మొత్తంగా నామినేషన్స్ రచ్చరచ్చగా జరిగాయి. ఆతర్వాత రూమ్ షేరింగ్ విషయంలోనూ గొడవ జరిగింది. పవర్ అస్త్రను సొంత చేసుకున్న సందీప్ ను డీలక్స్, స్టాండర్డ్ రూమ్స్ ను ఎవరెవరికి ఇస్తారో నిర్ణయించండని ఆర్డర్ వేశాడు. దాంతో డీలక్స్ రూంని షకీలా, శివాజీ, దామిని, శుభశ్రీ, అమర్‌దీప్‌కి ఇచ్చాడు సందీప్. స్టాండర్స్ రూంని రతిక, ప్రిన్స్, ప్రశాంత్, గౌతమ్, శోభాశెట్టి, ప్రియాంకకుఇచ్చాడు.
అలాగే తేజను బయట సోఫాలో పడుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో శోభా శెట్టి సందీప్ మధ్య గొడవ జరిగింది. శుభశ్రీకి డీలక్స్ రూం ఎందుకు ఇచ్చారు అంటూ సందీప్ పై ఫైర్ అయ్యింది శోభా శెట్టి. ఇక హౌస్ లో ఉన్న వారిలో పవర్ అస్త్ర సొంతం చేసుకోవడానికి మాయ అస్త్ర పేరుతో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కోసం ఓ గేమ్ ను హౌస్ లో ఉన్నవారితో ఆడించాడు . హౌస్ లో ఉన్నవారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు బిగ్ బాస్. రణధీర, మహాబలి పేరుతో డివైడ్ చేశారు. రణధీర టీమ్ లో అమర్‌దీప్, శివాజీ, ప్రిన్స్, ప్రియాంక, శోభా, షకీలా ఉండగా.. మహాబలి టీమ్ లో గౌతమ్, ప్రశాంత్, తేజ, రతిక,దామిని, శుభశ్రీ ఉన్నారు. ఈ గేమ్ లో రణధీర టీమ్ విజయాన్ని సాధించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
