AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amardeep: హీరోగా ఛాన్స్ కొట్టేసిన బిగ్‏బాస్ అమర్ దీప్.. హీరోయిన్ జోడి అదిరింది.. ఇంతకీ ఎవరంటే ?..

రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న అమర్.. ఇప్పుడు హీరోగాను మారాడు. ఇప్పటికే ఒకసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. గతంలో ఐరావతం అనే సినిమాతో వెండితెరపై సందడి చేశాడు. ఇందులో మోడల్ తన్వీ నేగి, ఎస్తేర్ నొరోహా కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రారంభించాడు. M3 మీడియా బ్యానర్ లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు.

Amardeep: హీరోగా ఛాన్స్ కొట్టేసిన బిగ్‏బాస్ అమర్ దీప్.. హీరోయిన్ జోడి అదిరింది.. ఇంతకీ ఎవరంటే ?..
Bigg Boss Amardeep
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2024 | 3:16 PM

Share

‘జానకీ కలగనలేదు’ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఇందులో రామ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదే క్రేజ్‏తో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టాడు. టైటిల్ విన్నర్ అమర్దీప్ కావడం పక్కా అనుకున్నారు. కానీ హౌస్‏లోకి వెళ్లాక గేమ్ ఆడడంలో కాస్త తడబాడ్డాడు. టైటిల్ విన్నర్ గా ఆట బరిలోకి దిగిన అమర్.. స్టార్ మా బ్యాచ్ ఫౌల్ గేమ్స్, గెలవాలనే తపనతో మిస్టెక్స్ చేయడం.. కోపంలో కంట్రెల్ తప్పడంతో టైటిల్ రేసులో వెనకబడ్డాడు. దీంతో బిగ్‏బాస్ రన్నరప్ గా నిలిచాడు. ఇక బిగ్‏బాస్ షోలో ఉండగానే తన అభిమాన హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా రవితేజ వచ్చేసి స్టేజ్ అమర్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన హీరో సినిమాలో ఛాన్స్ అనగానే టైటిల్ అడుగుదూరంలోనే వదిలేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో సినిమా పట్ల.. తన ఫేవరేట్ హీరో పట్ల అమర్ అభిమానం చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోయారు.

రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న అమర్.. ఇప్పుడు హీరోగాను మారాడు. ఇప్పటికే ఒకసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. గతంలో ఐరావతం అనే సినిమాతో వెండితెరపై సందడి చేశాడు. ఇందులో మోడల్ తన్వీ నేగి, ఎస్తేర్ నొరోహా కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రారంభించాడు. M3 మీడియా బ్యానర్ లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరో వినోద్ కుమార్ తోపాటు రాజా రవీంద్ర వంటి సీనియర్ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో అమర్ దీప్ సరసన సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీతను ఎంపిక చేశారు. ఈ మూవీతోనే సుప్రీత తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే సుప్రీతకు సోషల్ మీడియాలో ఎక్కువగానే పాపులారిటీని సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ స్టైలీష్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. దీంతో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వొచ్చుగా అంటూ నెటిజన్స్ అనేకసార్లు కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు అమర్ దీప్ జోడిగా కనిపించనుంది. వీరిద్దరి జంట వెండితెరపై మరింత అందంగా కనిపించనుంది. ఇప్పటికే సుప్రీతకు 8 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.