Bigg Boss : అప్పుడు 200 కోట్లు.. ఇప్పుడేమో.. తగ్గిన సల్మాన్ రెమ్యునరేషన్.. బిగ్‍బాస్ షోకు ఎన్ని కోట్లంటే..

బిగ్‍బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అయితే ఆ షోను ముందుకు నడపడంలో హోస్ట్ దే ప్రధాన పాత్ర. కంటెస్టెంట్స్ తప్పొప్పులు చెప్పడానికి.. సరిదిద్ధడానికి హోస్ట్ వీకెండ్ లో రెండుసార్లు రావడం.. ఆ ఎపిసోడ్స్ కు ఉండే టీఆర్పీ గురించి తెలిసిందే. బిగ్‍బాస్ రియాల్టీ షోకు ఎక్కువ కాలంగా హోస్టింగ్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్.

Bigg Boss : అప్పుడు 200 కోట్లు.. ఇప్పుడేమో.. తగ్గిన సల్మాన్ రెమ్యునరేషన్.. బిగ్‍బాస్ షోకు ఎన్ని కోట్లంటే..
Salman Khan

Updated on: Jul 26, 2025 | 2:21 PM

చిన్నా చితక సెలబ్రిటీల కెరీర్‌కు అప్పట్లో బిగ్‌ ప్లస్‌గా ఉన్న బిగ్ బాస్.. ఇప్పుడు మాత్రం మైనస్‌గా మారిపోయిందినే కామెంట్ ఉంది. ఒకప్పుడు టాప్‌ రేటింగ్‌తో నెంబర్‌ వన్‌ రియాల్టీ షోగా కంటిన్యూ అయ్యే ఈ షో.. రాను రాను క్రేజ్‌ను కోల్పోతూ వస్తోంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ భారీ డౌన్‌ ఫాల్‌ను నమోదు చేస్తోంది. ఇక ఈ డౌన్‌ ఫాల్‌కు తగ్గట్టే ఇప్పుడు హిందీ బిగ్ బాస్‌ మేకర్స్ ఓ బిగ్ డెసీషన్‌ తీసుకున్నారట. ఈ షోకు బ్యాక్‌ బోన్‌ గా ఉన్న .. స్టార్‌ హోస్ట్ సల్మాన్‌కే బిగ్ ఝలక్ ఇచ్చారట.

ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

బిగ్ బ్రదర్‌ అనే డచ్‌ రియాల్టీకు కాపీగా.. 2006లో బిగ్ బాస్ రియాల్టీ షో హిందీలో స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్‌కు అర్షద్ వార్సీ హోస్ట్‌గా వ్యవహరించగా.. మూడో సీజన్‌ను అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత నాలుగో సీజన్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌ ఈ షోను తన భుజాలపై వేసుకుని తన క్రేజ్‌తో .. తన హోస్టింగ్‌ స్కిల్స్‌తో … ఈ రియాల్టీ షోను టాప్‌ రేటెడ్‌ షోగా తీర్చిదిద్దారు. అంతేకాదు సీజన్స్‌ పెరుగుతున్న కొద్దీ రెమ్యునరేషన్‌ను కూడా భారీగానే అందుకున్నాడు సల్మాన్ ఖాన్.అలా ఇప్పటి వరకు 18 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తొందర్లో సీజన్‌ 19లోకి ఎంటర్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి:  Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్‌ 19పై ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 18 పరమ చెత్త అనే కామెంట్ రావడం.. టీఆర్పీ రేటింగ్‌లో చాలా వెనక పడిపోవడంతో.. ఆ ఎఫెక్ట్ సీజన్ 19పై పడింది. ఈక్రమంలోనే బిగ్ బాస్ మేకర్స్ ఈ షో బడ్జెట్‌లో కోత పెట్టేందుకు ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగా.. 200 కోట్లుగా ఉన్న సల్మాన్‌ రెమ్యునరేషన్‌ను 100 కోట్లకు మార్చారట. అంతేకాదు సల్మాన్ కూడా తన రివైజ్‌డ్‌ రెమ్యునరేషన్‌కు అంగీకరించారని.. బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..