Bellamkonda Sreenivas: ‘మీపై గౌరవం పెరిగింది అన్నా’.. అంధులకు ఆహారం, దుస్తులు అందజేసిన బెల్లం కొండ శ్రీనివాస్

|

Jul 25, 2024 | 5:34 PM

సుమారే పదేళ్ల క్రితం వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్. మొదటి సినిమాతోనే మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ) సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు.

Bellamkonda Sreenivas: మీపై గౌరవం పెరిగింది అన్నా.. అంధులకు ఆహారం, దుస్తులు అందజేసిన బెల్లం కొండ శ్రీనివాస్
Bellamkonda Sreenivas
Follow us on

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బెల్లం కొండ శ్రీనివాస్. తన దైన డ్యాన్స్ లు, ఫైట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సుమారే పదేళ్ల క్రితం వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్. మొదటి సినిమాతోనే మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ) సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా రాక్షసుడు, జయ జానకి నాయక సినిమాల్లో శ్రీనివాస్ నటనకు చాలా మంచి పేరొచ్చింది. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి గురువారం (జులై 25) తో పదేళ్లు పూర్తయ్యింది. 2014 జులై 24న బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీను రిలీజైంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో తన పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇదే సందర్భంగా తన మంచి మనసును చాటుకుంటూ అంధులకు ఆహారం, బట్టలు పంపిణీ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా, అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

 

ఇవి కూడా చదవండి

‘ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ పదేళ్లు మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి. నా సినిమాలను ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జయాపజయాలతో సంబంధం లేకుండా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. వారి సహకారమే ఎప్పుడూ నిలబడేలా చేసింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నాకెంతో ఇచ్చిన ఈ సమాజానికి ఇలాంటి అద్భుతమైన రోజున ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. అందుకు ఆనందాన్నిఇలా పంచుకుంటున్నాను. మీ దీవెనలు, సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్ లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు బెల్లం కొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు శ్రీనివాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అంధ విద్యార్థులతో హీరో బెల్లం కొండ శ్రీనివాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి