బడా బ్యానర్ లో బెల్లంకొండ బ్రదర్ సినిమా.. అన్న బాలీవుడ్ లో తమ్ముడు టాలీవుడ్ లో రాణిస్తాడా..?

అల్లుడు అదుర్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో

బడా బ్యానర్ లో బెల్లంకొండ బ్రదర్ సినిమా.. అన్న బాలీవుడ్ లో తమ్ముడు టాలీవుడ్ లో రాణిస్తాడా..?
Bellamkonda Ganesh Babu
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2021 | 9:14 PM

అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.  చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ వారబ్బాయికి రాక్షసుడు సినిమా కాస్త  ఊరటనిచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ్ రీమేక్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమా చత్రపతి ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గత ఏడాది గణేష్ మొదటి సినిమా పవన్ సాధినేని దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మొదటి సినిమానే ఇంతవరకు పట్టాలెక్కలేదు ఇప్పడు రెండో సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గణేష్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ బ్యానర్స్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఒకటి. మొదటి సినిమా పట్టాలెక్కకుండానే నెక్స్ట్ సినిమా ఇంత పెద్ద బ్యానర్ లో చేయడం నిజంగా విశేషమే. మరి ఈ కుర్రహీరో ఎలా రాణిస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Tej : చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. పిక్ లో ఉన్న మరో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

Wild Dog Movie Success Meet: యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటున్న నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్..