Sita Ramam: అందమైన ప్రేమకథ ‘సీతారామం’ సినిమాకు పెట్టిందెంతో.. రాబట్టిందెతో తెలుసా..

|

Sep 24, 2022 | 8:22 AM

టాలీవుడ్ లో బడా నిర్మాత అశ్వినీదత్ బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాదాపు 40 సినిమాలు వైజయంతి బ్యానర్ నుంచి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.

Sita Ramam: అందమైన ప్రేమకథ సీతారామం సినిమాకు పెట్టిందెంతో.. రాబట్టిందెతో తెలుసా..
Sita Ramam
Follow us on

టాలీవుడ్‌లో బడా నిర్మాత అశ్వినీదత్ బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాదాపు 40 సినిమాలు వైజయంతి బ్యానర్ నుంచి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమా వరకు ప్రేక్షకులను అలరించింది వైజయంతి మూవీస్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సీతారామం సినిమా గురించి స్పెషల్ గా చెప్పాలి. అందమైన ప్రేమకథలను తెరకెక్కించే హనురాఘవాపుడి దర్శకత్వం నుంచి వచ్చిన సీతారామం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమాలో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం అయిన దుల్కర్.. సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడు. తనదైన సహజ నటనతో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అటు హీరోయిన్ మృణాళిని కూడా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక కీలక పాత్రలో నటించిన రష్మిక మందన్న కూడా ఈ సినిమాలు ప్లెస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు హిందీలోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఆయన అసలు బడ్జెట్ అయితే రూ.51 కోట్లు అని.. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం పెట్టిన పెట్టుబడి కంటే 11 నుంచి 13 కోట్ల మధ్యలో ఎక్కువగా ప్రాఫిట్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..