Animal Movie: యానిమల్ మూవీకి షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్..
రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు..త్రిప్తి దిమ్రీ, రణబీర్ కపూర్ బోల్డ్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి. చాలా మంది ఈ సీన్స్ పై మండిపడ్డారు. చాలా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు ఈ సన్నివేశాలను కట్ చేసింది. ఇలాంటి సన్నివేశాలు అక్కడి ప్రేక్షకులకు సరిపడవని సెన్సార్ సభ్యులు తేల్చిచెప్పినట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు..త్రిప్తి దిమ్రీ, రణబీర్ కపూర్ బోల్డ్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి. చాలా మంది ఈ సీన్స్ పై మండిపడ్డారు. చాలా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు ఈ సన్నివేశాలను కట్ చేసింది. ఇలాంటి సన్నివేశాలు అక్కడి ప్రేక్షకులకు సరిపడవని సెన్సార్ సభ్యులు తేల్చిచెప్పినట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఇండియాలో ‘యానిమల్’ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. కొన్ని రా-హాట్ సన్నివేశాల క్లోజప్ షాట్‌లను తొలగించిన తర్వాతే చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు. సినిమాలో బూతులుతోపాటు హింస కూడా ఎక్కువే. అందుకే ‘యానిమల్’ సినిమాపై విమర్శలు వచ్చాయి. కానీ బంగ్లాదేశ్‌లో అలాంటి సన్నివేశాలకు అనుమతి లేదు.
బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ సభ్యులు ‘యానిమల్’ సినిమా 27 నిమిషాలను కట్ చేశారు. ఇప్పుడు దాని మొత్తం వ్యవధి 2 గంటల 56 నిమిషాలు. డిసెంబర్ 1న ఇండియాలో విడుదలైన ఈ చిత్రం రణబీర్ కపూర్‌కు పెద్ద విజయాన్ని అందించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ రూ.532 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై మరోసారి విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగులపై ఓ వర్గం ప్రేక్షకులు విమర్శలు గుప్పించారు. అయినా కూడా చిత్రయూనిట్ వెనకడుగు వేయలేదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ సినిమాకు షాక్ ఇచ్చింది.
యానిమల్ మూవీ ట్విట్టర్ పోస్ట్
Soulful #Marham #Evarevaro #YaarYaaro #Nooraru #PalaMukhangal Available on your favourite music platforms 🩷🎶https://t.co/diIaSUmyiz#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/wtSjYToZ3a
— Animal The Film (@AnimalTheFilm) December 24, 2023
యానిమల్ మూవీ ట్విట్టర్ పోస్ట్
#Animal is now 4th highest Indian grosser in North America 🤙🏼🔥
Book your tickets 🎟️- https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/GoXWZ7p9Rh
— Animal The Film (@AnimalTheFilm) December 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
