Dhamaka Movie : అలా చేసి ఉంటే ధమాకా ఒక్కరోజే ఆడేది.. బండ్ల గణేష్ సంచలన కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ అన్న కూడా ఆయనకు అదే అభిమానం. తాజాగా ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు రవితేజ. ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా బండ్లగణేష్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేవలం అభిమాని మాత్రేమే కాదు భక్తుడు అని అందరికి తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే బండ్ల గణేష్ వల్లే అవుతుంది. ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ గురించి గుక్క తిప్పుకోకుండా ఎక్కడా తడబడకుండా.. అనర్గళంగా మాట్లాడగలరు బండ్ల గణేష్. అలాగే మాస్ మహారాజా రవితేజ అన్న కూడా ఆయనకు అదే అభిమానం. తాజాగా ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు రవితేజ. ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా బండ్లగణేష్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు అని చెప్పుకొచ్చాడు.
అలాగే ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఎవరీ సపోర్ట్ లేకుండా అనుకున్నది సాధించి కొన్ని వందల మందికి అవకాశాలు ఇస్తున్నారు రవితేజ అన్నారు. రవితేజ ఒక ఇన్స్పిరేషన్ .. రవితేజ ఇంటీగ్రీటీ.. రవితేజ రాయాల్టీ,.. రవితేజ.. రియాల్టీ.. రవితేజ ..రాజసం.. రవితేజ అరాచకం. రవితేజ ఎవర్ గ్రీన్. ధమాకా సినిమా చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఏ ఫ్రేమ్ లో చూసిన అద్భుతంగా వుంది. రవితేజతో పని చేయడం మా అదృష్టం. రవితేజ సహచరులవ్వడం మాకు గర్వకారణం. రవితేజ రియల్ కింగ్. ధమాకా డైరెక్టర్ ఇరగదీశారు. ధమాకా రవితేజ అరాచకం. వందకోట్లని క్రాస్ చేస్తుంది. ఇది రవితేజ పవర్.” అన్నారు.అలాగే నిర్మాత గురించి మాట్లాడుతూ.. ‘ మీరు ఈ సినిమాని రవితేజతో కాకుండా వేరే హీరోతో చేసి ఉంటే ఒక్కరోజు మాత్రమే ఆడేది అని షాకింగ్ కామెంట్ చేశారు.
ఇక బండ్లగణేష్ ప్రొడ్యూసర్ గా చేసిన మొదటి సినిమా రవితేజాతోనే.. ఆంజనేయులు అనే సినిమా చేశారు బండ్ల గణేష్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకాలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.