
దీపావళి పండగను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. శనివారం (అక్టోబర్ 19) తన ఇంట్లో నిర్వహించిన ఈ గ్రాండ్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, సిద్దు జొన్నల గడ్డ, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతలు అశ్వనీదత్, నవీన్ యెర్నేని, రోషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ, జేడీ చక్రవర్తి, తరుణ్, మౌలి ఇలా చాలా మంది స్టార్స్ హాజరయ్యారు.ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే పార్టీలో కొందరు సినీ ప్రముఖులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేశ్. ముఖ్యంగా హనుమాన్, మిరాయ్ సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో తేజ సజ్జా పై ప్రశంసలు కురిపించాడు. ‘ ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నెక్ట్స్ అల్లు అర్జున్ తేజ సజ్జానే’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారందరూ బండ్ల గణేశ్ మాటలకు చప్పట్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇదే పార్టీలో డైరెక్టర్ హరీశ్ శంకర్ ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బండ్లన్న. ‘నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పార్టీకి ఒకే కారులో వచ్చారు చిరంజీవి, శ్రీకాంత్. ఈ సందర్భంగా కారు దిగగానే బండ్ల గణేశ్ చిరంజీవి పాదాలకు నమస్కరించాడు. అనంతరం తనే స్వయంగా చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ ప్రత్యేకమైన కుర్చీలో చిరంజీవిని కూర్చొబెట్టాడు. కాగా కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు బండ్ల గణేశ్. త్వరలోనే అతను మళ్లీ సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులందరికీ గ్రాండ్ గా దీపావళి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
#TFNExclusive : “In Indian Cinema, #TejjaSajja will become another #AlluArjun” – @ganeshbandla 🔥#BandlaDiwali2025 #BandlaGanesh #TeluguFilmNagar pic.twitter.com/e3hDcKhcKm
— Telugu FilmNagar (@telugufilmnagar) October 19, 2025
#TFNExclusive: “#HarishShankar and my Boss #PawanKalyan turned my life” – @ganeshbandla 💥#AnilRavipudi, #BoyapatiSreenu attend the Diwali Party. #BandlaDiwali2025 #BandlaGanesh #TeluguFilmNagar pic.twitter.com/a0jvHH44oq
— Telugu FilmNagar (@telugufilmnagar) October 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.