
ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది హానీ రోజ్. అందం.. అభినయంతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమాతో అలరించింది. ఇందులో అందరి చూపు ఈ ముద్దుగుమ్మ పైనే. ఈ చిత్రంలో బాలయ్యతోపాటు.. ఈ అమ్మడు నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో హానీరోజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వీరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హనీరోజ్ పేరు నెట్టింట మారుమోగింది. హానీ రోజ్ గురించి తెలుసుకోవడానికి నెట్టింట తెగ ఆసక్తి చూపించారు నెటిజన్స్. ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ హానీ రోజ్ సందడి తక్కువ లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్‌లో ఉంటుంది ఈ కేరళ కుట్టి. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో యూట్యూబ్‌లో తెగ వైరలవుతుంది.
యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న ఆ వీడియోలో హానీరోజ్.. సీనియర్ హీరో మోహన్ లాల్‌తో కలిసి మజావిల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ 2022 వేడుకలలో అందంగా డాన్స్ చేసింది. ఆమె డాన్స్ ప్రాక్టిస్ వీడియోతోపాటు స్టేజీపై స్టెప్పులేసిన వీడియోను జత చేసిన ఈ బ్యూటీఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మోహన్‌లాల్ తో కలిసి అందంగా డాన్స్ చేసిన హానీ రోజ్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వీరసింహ రెడ్డి సూపర్ హిట్ తర్వాత ఈ వీడియోను మరోసారి ఆడియన్స్ లైక్ చేస్తున్నారు.
వీరసింహరెడ్డి సినిమా తర్వాత హానీ రోజ్‌కు తెలుగులో మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ కేరళ కుట్టి. ఇటీవల విశాఖపట్నంలోని ఓ నగల దుకాణాన్ని ప్రారంభించింది హానీ రోజ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.