AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణ, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ అదే.. నందమూరి ఫ్యాన్స్‏కు ఇక పండగే..

NBK108 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక గతంలో విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Balakrishna: బాలకృష్ణ, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ అదే.. నందమూరి ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: May 30, 2023 | 3:49 PM

Share

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. NBK108 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక గతంలో విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా టైటిల్ ‘భగవత్ కేసరి’ అని ఫిక్స్ చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా.. ‘ఐ డోంట్ కేర్’ అనే ట్యాగ్ లైన్ ఉంటుందట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విజయ దశమికి రిలీజ్ చేయనున్నారు. ఇక బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ సినిమా రివెంజ్ డ్రామా అని.. ఇందులో వినోదాన్ని మించి భారీ యాక్షన్ ఉంటుందని టాక్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. బాలయ్య పుట్టినరోజు జూన్ 10న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. ఇక ఇందులో తొలిసారిగా బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. కీలకపాత్రలో శ్రీలీల కనిపించనుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి