AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saami Saami Song: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న ‘సామీ సామీ’ సింగర్.. దర్శకుడు ఎవరంటే..

డైరెక్టర్ సుకుమార్, స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయగా.. ఆ చిత్రంలోని పాటలు సైతం నెట్టింటిని షేక్ చేశాయి. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగులో ఈ పాటను మౌనిక యాదవ్ ఆలపించగా.. తమిళంలో రాజ్యలక్ష్మి పాడారు. పాటతోపాటు.. సింగర్స్ సైతం ఫేమస్ అయ్యారు.

Saami Saami Song: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న 'సామీ సామీ' సింగర్.. దర్శకుడు ఎవరంటే..
Saami Saami Song
Rajitha Chanti
|

Updated on: May 30, 2023 | 3:18 PM

Share

నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా.. సామి నా సామి.. నిను సామి సామి అంటాంటే.. నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా.. సామి నా సామి.. ఈ సాంగ్ యూట్యూబ్‏ను ఓ ఊపు ఊపేసింది. సోషల్ మీడియాలో ఈ పాటకు చిన్న పెద్ద స్టెప్పులేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయగా.. ఆ చిత్రంలోని పాటలు సైతం నెట్టింటిని షేక్ చేశాయి. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగులో ఈ పాటను మౌనిక యాదవ్ ఆలపించగా.. తమిళంలో రాజ్యలక్ష్మి పాడారు. పాటతోపాటు.. సింగర్స్ సైతం ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పుడు హీరోయిన్‏గానూ మారారు సింగర్ రాజ్యలక్ష్మి. బుల్లితెరపై సూపర్ సింగర్స్ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత గాయనిగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం లైసెన్స్.

ఈ సినిమాను జేఆర్జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్.జీవానందం నిర్మించగా.. ఈ చిత్రానికి గణపతి బాలమురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్యలక్ష్మితోపాటు.. నటుడు రాధారవి, ఎన్.జీవానందం, విజయ్ భారత్, పళ.కరుప్పయ్య, గీత కైలాసం, అభి నక్షత్ర ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పేరరసు, నిర్మాత టీ. శివ అతిథులుగా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా గాయని రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. “30 ఏళ్ల వయసులో ఇద్దరి పిల్లల తల్లి అయిన నేను కథానాయికగా నటిస్తానని ఊహించలదేు. ఈ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసి లైసెన్స్ చిత్రం కథను చెప్పారు. ఇంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో తాను నటించగలనా అనే సందేహాన్ని వ్యక్తం చేయగా ఈ కథలో ఇతర పాత్రలకు చాయిస్‌ ఉంది గానీ.. కథానాయకి పాత్రకు మీరు తప్ప వేరే చాయిస్‌ లేదని దర్శకుడు. ఈ సినిమాలో నాకు ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది.” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు