Balakrishna: బాలయ్యతో కలిసి డైలాగ్ అదరగొట్టిన సప్తగిరి.. ఫిదా అయిన నటసింహం.. కాళ్లు పైకి ఎత్తు అంటూ..
తాజాగా కమెడియన్ సప్తగిరితో కలిసి బాలయ్య సరదాగా ఓ డైలాగ్ చెబుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో బాలయ్య పవర్ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్.. గ్లింప్స్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్యకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలో శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే షూటింగ్ సెట్ నుంచి బాలయ్య.. డైరెక్టర్.. శ్రుతిహాసన్ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా కమెడియన్ సప్తగిరితో కలిసి బాలయ్య సరదాగా ఓ డైలాగ్ చెబుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో సప్తగిరితో బాలయ్య ఓ డైలాగ్ చెబుతున్నారు. ఇద్దరు కలిసి ఒకేసారి డైలాగ్ చెబుతుండగా.. మధ్యలో బాలయ్య ఆపేశారు. అనంతరం సప్తగిరి అదే డైలాగ్‌ను కంప్లీట్ చేశారు. అయితే సప్తగిరి చెప్పిన తీరుకు బాలయ్య ఫిదా అయ్యారు . దీంతో వెంటనే సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే సప్తగిరి నవ్వుతూ బాలయ్య కాళ్ల మీద పడి నేలపై కూర్చున్నాడు. అనంతరం బాలయ్య నవ్వుతూ.. ఓసారి నీకాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ సింప్లిసిటికీ.. అభిమానులతో.. నటులతో ఆయన కలిసిపోయే విధానం చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.




Balayya babu and Saptagiri funny conversation #NandamuriBalakrishna#Balakrishna #Saptagiri #NBK107 pic.twitter.com/iD6yDwo0zm
— Balayya Yuvasena (@BalayyaUvasena) September 9, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.