బాలీవుడ్‌లో మరపురాని విలన్ పాత్రలు ఇవే.. 

05 March 2025

Prudvi Battula 

బాలీవుడ్‌లోని క్రూరమైన గ్యాంగ్‌స్టర్ల నుంచి మోసపూరిత సూత్రధారుల వరకు అత్యంత ప్రసిద్ధ విలన్‌లు తమ మరపురాని నటనతో శాశ్వత ముద్ర వేశారు.

గబ్బర్ సింగ్ – షోలే: 'కిత్నే ఆద్మీ ది?', ఈ నాలుగు పదాలు అమ్జాద్ ఖాన్ గబ్బర్ సింగ్‌ను బాలీవుడ్ విలన్‌గా స్థిరపరిచాయి.

అక్రమ్ - సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్: 'ముజే గందగీ బహుత్ పసంద్ హై, ఐ లవ్ కచ్రా.' అనే డైలాగ్‌తో బాలీవుడ్‌లోని అనుజ్ సింగ్ దుహాన్ అక్రమ్ అనే విలన్‌గా మెప్పించారు.

పద్మావత్ మూవీలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ ఉత్కంఠభరితమైన నటన బాలీవుడ్ విలన్లకు కొత్త కోణాన్ని తీసుకువచ్చింది.

మిస్టర్ ఇండియాలో 'మొగాంబో ఖుష్ హువా!' అంటూ అమ్రిష్ పురి మొగాంబో పాత్రలో శక్తివంతమైన ఉనికి, మోసపూరిత ప్రణాళికలతో, అత్యంత ప్రసిద్ధ విలన్లలో ఒకరిగా నిలిచాడు.

అందాజ్ అప్నా అప్నాలో 'ఆయా హూన్, కుచ్ తో లేకే జావుంగా!' అంటూ శక్తి కపూర్ చేసిన క్రైమ్ మాస్టర్ గోగో విలనీతో కామెడీని మిళితం చేశాడు.

వెల్కమ్ మూవీలో ఉదయ్ శెట్టిగా నానా పటేకర్, మజ్ను భాయ్‎గా అనిల్ కపూర్ గ్యాంగ్ స్టర్ జీవితానికి హాస్యాన్ని యాడ్ చేసారు.

అగ్నిపథ్‌లో సంజయ్ దత్ నటించిన కాంచా చీనా ఆకట్టుకునేలా ఉంది. అతని బట్టతల రూపం క్రూరమైన వ్యూహాలు అతన్ని భయంకరమైన విలన్‎గా చేశాయి.