
నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం థియేటర్లలో అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ 2 తాండవం శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య నటనకు అభిమానులందరూ ఫిదా అవుతున్నారు. ఆయన చేసి యాక్షన్ సీక్వెన్సులు, పలికిన డైలాగులతో సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ నామసమ్మరణే వినిపిస్తోది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ‘అఖండ 2’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఇక సినిమా చూసిన అభిమానులకు చిత్రబృందం ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో మూడో భాగం కూడా రాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. ‘జై అఖండ’ పేరుతో ‘అఖండ 3’ ఉంటుందని సినిమా చివర్లో ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందం మరింత రెట్టింపయ్యింది. అఖండ2 లోనే రుద్ర తాండవం చూపించిన బాలయ్య జై అఖండ లో ఇంకెంత పవర్ ఫుల్ గా కనిపిస్తారోనని అభిమానులు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.
అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. సంయుక్త మేనన్ కథానాయికగా కనిపించింది. అలాగే బజ్ రంగీ బాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో మెరిసింది. వీరితో పాటు ఆది పిని శెట్టి, కబీర్ సింగ్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట నిర్మించిన ఈ సినిమాకు బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. ఇక నందమూరి తమన్ అందించిన స్వరాలు, బీజీఎమ్ అఖండ 2 సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.
THE THAANDAVAM HAS STRUCK THE NATION LIKE A FIRESTORM! 💥🔥
Blockbuster response from the premieres!#Akhanda2 in cinemas NOW.
Book your tickets now.
🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam pic.twitter.com/v2WYypK5ix— 14 Reels Plus (@14ReelsPlus) December 12, 2025
Theatres are turning into temples 🙏❤️
Akhanda Thaandavam taking over everywhere 🔥#Akhanda2#NandamuriBalakrishna pic.twitter.com/fuxv8o6opC
— Praneeth Chowdary (@praneethballa) December 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.