Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda Movie: కరోనా ఎఫెక్ట్.. సంక్రాంతి పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్న నందమూరి నటసింహం..

నట సింహం నందమూరి బాలకృష్ణ  అఖండగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాకోసం

Akhanda Movie: కరోనా ఎఫెక్ట్.. సంక్రాంతి పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్న నందమూరి నటసింహం..
Balakrishna Akhanda
Follow us
Rajeev Rayala

|

Updated on: May 21, 2021 | 9:11 AM

Akhanda Movie:

నట సింహం నందమూరి బాలకృష్ణ  అఖండగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాకోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టిస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది. మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే మార్కెట్ రేంజ్ తగ్గుతోందనే అపవాదును మోస్తున్నారు బాలయ్య. అందుకే ఆయన్ను సింహంగా.. లెజండ్ గా మార్చిన బోయపాటి శ్రీనుకే మరో సారి ఛాన్స్‌ ఇచ్చి సినిమాను మొదలెట్టాశారు. ఈసారి ఎలాగైనా ఇండస్ట్రీ హిట్‌ కొట్టి బాలయ్య బ్యాక్‌టూ ఫాం అని నిరూపించుకోవానలకున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్స్ చూసిన దగ్గర నుంచి, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది.నిజానికి ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకి అవాంతరాలు కలుగుతూ ఉండటంతో, షూటింగును పూర్తి చేయలేకపోయారు.కరోనా ప్రభావం తగ్గిన తరువాతగానీ, సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఆ తరువాత మళ్లీ షూటింగును మొదలుపెట్టాలి .. మిగతా పనులను పూర్తిచేయాలి. అంతా అనుకున్నట్టు జరిగితే సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరో వైపు బాలయ్యకు ఎలాగో సంక్రాంతి హీరో అనే పేరు ఉంది కాబట్టి పండగ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ‘పెళ్లి సందడి’ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

Buchi Babu Sana: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బుచ్చిబాబు.. యంగ్ టైగర్ తో సినిమా చేయనున్న ఉప్పెన డైరెక్టర్…