Veera Simha Reddy: ఒంగోలులో గర్జించడానికి వచ్చేస్తున్న నటసింహం.. వీర సింహా రెడ్డి ప్రీరిలీజ్ ఎప్పుడంటే
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.
బాలకృష్ణ త్వరలోనే వీరసింహారెడ్డి గా థియేటర్స్ లో గర్జించడానికి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. గత ఏడాది అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు బాలకృష్ణ. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బాలయ్య మార్కెట్ ను 200కు పైగా పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వీర సింహారెడ్డి అనే సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ బాలయ్యకు జోడీగా నటిస్తోంది. అలాగే హాని రోజ్ కూడా మరో పాత్రలో మెరవనుంది. అలాగే ఈ మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో భారీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, గ్లిమ్ప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
జనవరి 6న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీరిలీజ్ ఒంగోలు లో నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాను మైత్రిమూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికానుకగా వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.