Baby Trailer: నిజంగా ప్రేమించే అబ్బాయిల కథే ఇది.. ఆకట్టుకుంటున్న ‘బేబీ’ ట్రైలర్..

ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ఓ రెండు ప్రేమ మేఘలిలా.. సాంగ్ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకులలో బజ్ క్రియేట్ అయ్యింది. 2020లో కలర్ ఫోటోతో ప్రేక్షకులను మెప్పించిన సాయి రాజేష్.. ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా ఈమూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Baby Trailer: నిజంగా ప్రేమించే అబ్బాయిల కథే ఇది.. ఆకట్టుకుంటున్న బేబీ ట్రైలర్..
Baby Trailer

Updated on: Jul 07, 2023 | 8:22 PM

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బేబీ. కలర్ ఫోటో వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సాయి రాజేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విరాజ్ అశ్విన కీలకపాత్రలో నటిస్తుండగా.. వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ఓ రెండు ప్రేమ మేఘలిలా.. సాంగ్ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకులలో బజ్ క్రియేట్ అయ్యింది. 2020లో కలర్ ఫోటోతో ప్రేక్షకులను మెప్పించిన సాయి రాజేష్.. ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా ఈమూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఆధ్యంతం ఆకట్టుకుంటుంది బేబీ ట్రైలర్. అలాగే ఈ సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ తిరగనుందని అర్థమవుతుంది. స్కూల్లో ఓ అమ్మాయి మొదలుపెట్టిన ప్రేమ.. కాలేజీకి వెళ్లాక మరొక అబ్బాయి కోరుకున్న ప్రేమ.. ఇద్దరు అబ్బాయిలు ట్రూగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఆ తర్వాత వారందరి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులు.. వారి లైఫ్స్ ఎలా మలుపు తిరిగాయనేది కథ అని అర్థమవుతుంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us