AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : టాలీవుడ్‏లో ఆ ముగ్గురు హీరోలు అంటే చాలా ఇష్టం.. నాతో ఎంతో బాగుంటారు.. హీరోయిన్ స్నేహ.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో స్నేహ ఒకరు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూనే తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగులో తనకు ఇష్టమైన ముగ్గురు హీరోల గురించి చెప్పుకొచ్చారు. 

Actress : టాలీవుడ్‏లో ఆ ముగ్గురు హీరోలు అంటే చాలా ఇష్టం.. నాతో ఎంతో బాగుంటారు.. హీరోయిన్ స్నేహ.. 
Sneha
Rajitha Chanti
|

Updated on: May 27, 2026 | 7:03 PM

Share

టాలీవుడ్‌లో ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా, స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ స్నేహ. ‘ప్రియమైన నీకు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘వెంకీ’, ‘శ్రీరామదాసు’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ సీనియర్ నటి, సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి, ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున గురించి స్నేహ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటి స్నేహకు టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అయితే ప్రస్తుత తరం హీరోల్లో ఆమెకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపింది.

తనకి టాలీవుడ్‌లో నాగార్జున, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల నటన ఎంతో ఇష్టమని తెలిపారు. వారి నటన చాలా సరదాగా ఉంటుందని స్నేహా పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీరామదాసు చిత్రంలో నాగార్జున నటన చాలా గొప్పగా ఉందని అన్నారు. తనకు తెలుగులో నాగార్జున, రామ్ చరణ్, నాగార్జున ముగ్గురు హీరోలు అంటే చాలా అభిమానమని అన్నారు. ఇక తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘శ్రీరామదాసు’ సినిమా గురించి కూడా స్నేహ గుర్తుచేసుకున్నారు. కింగ్ నాగార్జున సరసన ఆమె పోషించిన పాత్రకు అప్పట్లో ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ ఆ సినిమా విజువల్స్, పాటలు ఎవర్ గ్రీన్ అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయడమే కాకుండా, నిజ జీవితంలోనూ ఎంతో హుందాగా ఉండే స్నేహ.. పరిశ్రమలో తనకు ఎందరో రోల్ మోడల్స్ ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న నటి స్నేహా, 2012లో వివాహం అనంతరం సినిమాల్లో నటించడం తగ్గించారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో రాణించి, హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన స్నేహా, ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి యోగా, వాకింగ్ వంటివి చేస్తానని, అందుకే తన శరీరం చురుకుగా ఉంటుందని స్నేహా వెల్లడించారు. చివరగా, తనకు ప్రత్యేకంగా రోల్ మోడల్స్ ఎవరూ లేరని, తనకి తానే రోల్ మోడల్ అని స్నేహా స్పష్టం చేశారు.

Follow Us