AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లికాడల గుడ్డు కూర.. ఇలా వండి తింటే టేస్ట్ అదుర్స్.. మొదలుపెడితే గిన్నెంత ఖాళీ చేస్తారంతే

ఈ ఉల్లికాడల గుడ్డు కూరలో మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. ఇంకా ఈ గుడ్లలో ఉండే పోషకాలు శక్తిని పెంచుతాయి అలాగే, ఉల్లికాడల్లో బాడీకి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అలాగే , ఇది తిన్న వెంటనే మొత్తం అరిగిపోతోంది ఇంకా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

Prasanna Yadla
|

Updated on: May 27, 2026 | 5:33 PM

Share
కావలసిన పదార్థాలు: 4 కప్పుల ఉల్లికాడలు, అయితే సన్నగా తరిమి పెట్టుకోవాలి.  4 గుడ్లు, మూడు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి తాలింపులోకి ఆవాలు, జీలకర్రను తీసుకోవాలి.

1 / 5
ఉల్లికాడలు గుడ్ల పులుసు తయారీ విధానం : ముందుగా పోపుకు రెడీ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడి అయినా తర్వాత దానిలో, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఇంకా దానిలో  నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలో కారం కొంచం తగ్గించాలి. ఆలాగే  నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి బాగా వేయించాలి.

2 / 5
ఈ మిశ్రమంలో ముందుగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  వాసన పోయే దాకా బాగా వేయించి దానిలో  ఒక కప్పు టమోటా ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా దీనిలో ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు వీటిని బాగా  బాగా ఉడికించాలి. కొద్దీ సేపటి తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా ఈ మిశ్రమంలో కనీసం 15  నిమిషాల పాటు బాగా వేయించాలి.

3 / 5
చివర్లో కొత్తిమీరను వేసుకోవాలి : రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసి ఆ తర్వాత గుడ్లను  బ్రేక్ వేసి ఈ మిశ్రమంలో వేయాలి. అయితే, వీటిని వెంటనే మెల్లిగా కలుపుతూ మూత పెట్టి 15 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇంకా చివర్లో కొత్తిమీర కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుతూ గుడ్డు కూడా ఉల్లికాడలతో కలిసిపోయే వరకు స్టవ్ మీదే దీనిని బాగా  వేయించాలి.

4 / 5
ఈ కూర తినడం వలన ఎన్నో లాభాలు: ఈ ఉల్లికాడల గుడ్డు కూరలో  మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. ఇంకా ఈ గుడ్లలో ఉండే పోషకాలు శక్తిని పెంచుతాయి అలాగే, ఉల్లికాడల్లో బాడీకి కావాల్సిన  విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అలాగే , ఇది తిన్న వెంటనే మొత్తం అరిగిపోతోంది ఇంకా జీర్ణక్రియ కూడా  మెరుగుపడుతుంది.

5 / 5
Follow Us