కళ్యాణి ప్రియదర్శన్ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. 2017 నుండి సినిమాల్లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.
2019లో తమిళ సినిమాలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. నటుడు శివకార్తికేయన్ సరసన నటించి మెప్పించింది.
2020 లో మలయాళ సినిమాలో నటిగా అడుగుపెట్టిన నటి కళ్యాణి ప్రియదర్శన్ అనేక చిత్రాల్లో నటించింది. .
పేరుకు మలయాళ హీరోయినే అయినప్పటికీ తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. అక్కినేని అఖిల్, సాయి ధరమ్ తేజ్ వంటి క్రేజీ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, ఛార్మింగ్ లుక్స్ తో తెలుగు ఆడియెన్స్ ను కట్టి పడేసింది హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్.
తెలుగులో అక్కినేని అఖిల్ తో కలిసి ‘హలో’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రియదర్శిని. అలాగే సాయి ధరమ్ తేజ్ సూపర్ హిట్ సినిమా చిత్రలహరి లోనూ నటించింది.
ప్రస్తుతం తన మాతృభాష మలయాళంలోనే వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజి బిజీగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది.