ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం…సంచలన దర్శకుడు కన్నుమూత…
సినిమా ఇండస్ట్రీని ఊహించని విషాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూయగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.

సినిమా ఇండస్ట్రీని ఊహించని విషాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూయగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఇప్పడు మరో విషాదం సినిమా పరిశ్రమను కమ్మేసింది. ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘అయ్యప్పనమ్ కోషియమ్’ చిత్ర దర్శకుడు ఆర్ సచిదానందన్ చనిపోయారు. ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల హిప్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ నుంచి కోలుకుంటూ ఉండగా మూడు రోజుల క్రితం కార్డియాక్ అరెస్ట్ అయింది. గురువారం రాత్రివరకు వెంటిలేటర్‌పై ఉండి మృత్యువుతో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇటీవల మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మేనన్ నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెరకెక్కించారు సచిదానందన్. ఈ సినిమా ఊహించని విజయం సొంతం చేసుకుంది. కేవలం 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ మూవీ చిత్రీకరణ సమయంలోనే కాలు నొప్పితో బాధపడ్డారీ దర్శకుడు. మొదట పృథ్వీరాజ్ హీరోగా వచ్చిన ‘చాక్లెట్’ చిత్రానికి స్టోరీని అందించిన సచి… 2015లో విడుదలైన ‘అనార్కలి’ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.




