AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి వేళయింది..! రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం ఎప్పుడు , ఎక్కడంటే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రష్మిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం ఆమె విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకుందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది.

పెళ్లికి వేళయింది..! రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం ఎప్పుడు , ఎక్కడంటే..
Vijay Deverakonda Rashmika
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2025 | 12:09 PM

Share

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఇద్దరూ కలిసి మీడియా కంట పడ్డారు కూడా.. అయితే ఎప్పుడూ రష్మికకానీ , విజయ్ గాని తాము ప్రేమలో ఉన్నట్టు అనౌన్స్ చేయలేదు. ఎట్టకేలకు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొద్దీ మంది సన్నిహితుల మద్యే ఈ వేడుక జరిగింది. ఇక ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది వీరి వివాహం గ్రాండ్ గా జరగనుందని తెలుస్తుంది. వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని సమాచారం.

కాగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహం 2026 ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరగనుందట. ఉదయపూర్ వీరి వివాహానికి వేదిక కానుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. పెళ్లి డేట్ బయటకు రావడంతో విజయ్ అభిమానులు, రష్మిక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ , రష్మిక కలిసి గీతగోవిందం అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రష్మికకు తెలుగులో ఇది రెండో సినిమా.. ఆతర్వాత మరోసారి విజయ్ తో కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేసింది.

ఇక ఇప్పుడు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. రష్మిక పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ ఇటీవలే కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..