RK Roja: చిరంజీవి తాత అయ్యుండోచ్చు కానీ.. మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్..

ఇక ఇప్పటికే చరణ్, ఉపాసన దంపతులకు.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీప్రముఖులు. తారక్, అల్లు అర్జున్, మహేష్ బాబు స్టార్స్ అందరూ ఇప్పటికే చెర్రీకి విషెస్ తెలుపగా.. తాజాగా సీనియర్ హీరోయిన్.. ఏపీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికిగా చరణ్, ఉపాసన దంపతులకు విషెస్ తెలిపారు.

RK Roja: చిరంజీవి తాత అయ్యుండోచ్చు కానీ.. మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్..
Rk Roja

Updated on: Jun 21, 2023 | 6:21 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. మంగళవారం (జూన్ 20న) మెగా కుటుంబంలోకి వారసురాలు అడుగుపెట్టింది. చిరు కుటుంబానికి సెంటిమెంట్ అయిన మంగళవారం రోజునే మహాలక్ష్మి జన్మించడంలో మెగా ఫ్యామిలీలో సంబరరాలు అంబరాన్ని తాకాయి. ఇక ఇప్పటికే చరణ్, ఉపాసన దంపతులకు.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీప్రముఖులు. తారక్, అల్లు అర్జున్, మహేష్ బాబు స్టార్స్ అందరూ ఇప్పటికే చెర్రీకి విషెస్ తెలుపగా.. తాజాగా సీనియర్ హీరోయిన్.. ఏపీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికిగా చరణ్, ఉపాసన దంపతులకు విషెస్ తెలిపారు.

“తాతయ్య అయిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎప్పుడూ యవ్వనంగా అలాగే శక్తివంతంగా ఉండే ఈ ఫ్యామిలీకి సర్వశక్తిమంతుడైన భగవంతుడు మెగా ప్రిన్సెస్ రూపంలో ఆశీర్వాదాన్ని అందించారు. రామ్ చరణ్ .. చిన్నప్పుడు నిన్ను నా చేతుల్లో హత్తుకున్న క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఇప్పుడు నీకు పాప జన్మించింది అన్న వార్త విని చాలా సంతోషమేసింది. చిరంజీవి సర్.. మీరు తాత అయినా ఎప్పటికీ మాకు హీరోనే.. ఉపాసన.. మీ ఇంటి చిన్న మహాలక్ష్మికి ఇవే నా ఆశీస్సులు ” అంటూ ట్వీట్ చేశారు రోజా.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం చరణ్ దంపతులకు విషెస్ తెలిపారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్, నిహారిక, అల్లు అర్జున్, అల్లు స్నేహ, అల్లు అరవింద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి ఉపాసనను పరామర్శించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.