Tollywood: చేపకళ్ల చిన్నది ఆడియన్స్ హృదయాలను దొచేసిన వయ్యారి.. ఎవరో గుర్తుపట్టండి..
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, కాజల్, శ్రీలీల, తమన్నాకు సంబంధించిన లేటేస్ట్ క్రేజీ పిక్స్, చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక అదే సమయంలోనే తాజాగా ఓ అందాల ముద్దుగుమ్మ క్రేజీ పిక్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చేపకళ్ల చిన్నది.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది.

సోషల్ మీడియా ప్రపంచం ఇప్పుడు ప్రేక్షకులకు.. సెలబ్రెటీలకు మధ్య వారధి. ఇంటర్నెట్ ద్వారా తమ ఫేవరేట్ సినీతారలకు సంబంధించిన మూవీ అప్డేట్స్.. వ్యక్తిగత విషయాలను ఇప్పుడు నేరుగా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొద్ది రోజులుగా స్టార్ హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, కాజల్, శ్రీలీల, తమన్నాకు సంబంధించిన లేటేస్ట్ క్రేజీ పిక్స్, చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక అదే సమయంలోనే తాజాగా ఓ అందాల ముద్దుగుమ్మ క్రేజీ పిక్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చేపకళ్ల చిన్నది.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. వరుసగా హిట్స్ అందుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ సంయుక్త మీనన్..
భీమ్లా నాయక్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ నటనతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బింబిసార సినిమాతో మెయిన్ హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా.. సంయుక్తకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.




ఆ తర్వాత సార్, విరూపాక్ష సినిమాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం డేవిల్ చిత్రంలో నటిస్తుంది. అలాగే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులోనూ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు గుంటూరు కారం చిత్రంలోనూ పూజా హెగ్డే స్థానంలో ఈ బ్యూటీని తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.