Anushka Shetty: రక్తంతో తడిసిన చేతలతో సిగార్ తాగుతూ.. ఘాటీ నుంచి స్వీటీ పవర్ ఫుల్ లుక్.. అసలు ఊహించలేదు
'బాహుబలి 2' సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో నటించడం లేదు అనుష్క. గతేడాది ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మరో పవర్ ఫుల్ రోల్ తో ఆడియెన్స్ ను అలరించేందుకు స్వీటీ సిద్ధమైంది.
టాలీవుడ్ లో దశాబ్దం పాటు స్టార్ నటిగా వెలుగొందిన అనుష్క శెట్టి.. ‘బాహుబలి 2’ సినిమా తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. 2017లో విడుదలైన ‘బాహుబలి 2’ సినిమా తర్వాత అనుష్క ఇప్పటి వరకు కేవలం నాలుగు సినిమాల్లోనే నటించింది. అందులోనూ ఒకటి అతిథి పాత్ర. అయితే ఇప్పుడు అనుష్క శెట్టి మళ్లీ సినీ పరిశ్రమలో మునపటి తరహాలో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు అనుష్క ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తోంది. గురువారం (నవంబర్ 07)ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఒక సినిమా పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో అనుష్క లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. అరుంధతి’, ‘భాగమతి’, ‘రుద్రమ్మదేవి’ వంటి పవర్‌ఫుల్ పాత్రల్లో నటించిన అనుష్క శెట్టి ఇప్పుడు మళ్లీ అలాంటి పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ‘ఘాటి’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుండగా, ఆ సినిమాలోని అనుష్క లుక్ పోస్టర్ ఇప్పుడు విడుదలైంది. ఇందులో రక్తంతో తడిసిన చేతులతో సిగార్ తాగుతూ డిఫరెంట్ గా కనిపించింది అనుష్క. ఇక నుదిటిన రక్త తిలకం, రెండు ముక్కుపుడకలతో మొత్తానికి అనుష్క లుక్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.ఇది ఆమె నటించిన అరుంధతి భాగమతి సినిమాలను గుర్తుచేస్తోంది.
ఘాటీ సినిమాలో అనుష్క…
ఇవి కూడా చదవండిView this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.