Telangana: అయ్యో పాపం..ఇలాంటి పరిస్థతి ఎవరికి రాకూడదు..

అప్పు చేయకండి.. తప్పు చేయకండి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ వాటిని ఎవరు పట్టించుకోరు. పెడచెవిన పెడుతూ ఉంటారు. అప్పు తీసుకొని కట్టలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఒకనొక దశలో ఆ అప్పులు తీర్చలేక కుటుంబంతో పాటే ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి ఘటనే ఒక్కటి నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.

Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 06, 2024 | 8:07 PM

అప్పులు ఇచ్చిన వారి వేధింపులకు మరో కుటుంబం బలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చిన్న వ్యాపారం చేసుకునే ఓ కుటుంబం అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురు కుటుంబసభ్యులు బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి కూతురు గోదావరి నీటిలో గల్లంతయ్యారు. తల్లిని మాత్రం అక్కడ ఉన్న స్థానికులు కాపాడి గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్‌లో నివాసం ఉంటున్న ఉప్పలించి వేణు..భార్య అనురాధ..కూతురు పూర్ణిమ. గంజి మార్కెట్లో ఇద్దరు వ్యాపారస్తులు రోషన్ , వికాస్‌ల దగ్గర సుమారు రూ.3 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు.. గంజి వ్యాపారులు చక్రవడ్డీ వేసి అప్పు కట్టమని లేకుంటే మీ సంగతి తెలుస్తామని వేధించడంతో బుధవారం ఉదయం బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.