AP News: ఓర్నీ.. చెంచా గాడిద పాల రేటెంతో తెలిస్తే మీ మతి పోద్ది

గంగిగోవు గరిటెడైనను చాలు.. కడివెడైనా నేమి కరము పాలు అనే వేమన శతకంలోని పద్యం తెగ పాపులర్. ఆ వేమన కవి పద్యం రాసినప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయేమో కానీ.. అదే వేమనను ఇప్పుడు పద్యం రాయమంటే మాత్రం.. గరిటెడైనను చాలు కరము పాలు.. కడివెడైనా నేమి గోవుపాలు అని రాస్తారేమో.. అవును.. చెంచాడు గాడిద పాలు రేటెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.

AP News: ఓర్నీ.. చెంచా గాడిద పాల రేటెంతో తెలిస్తే మీ మతి పోద్ది
Donkey Milk
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2024 | 1:40 PM

గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతూ గాడిద పాలు అమ్మడం కొత్త సీనేం కాదు. కానీ ఎంతకు అమ్ముతున్నారు అనేది ఇప్పుడు పాయింట్. పిల్లలకు మూడు పూటలకు మూడొందల చొప్పున తొమ్మిది వందలట.. పెద్దోల్లకైతే ఇంకొన్ని ఎక్కువ ఇస్తారు. మూడు పూటలకు 500 లెక్కన పదిహేను వందలట. అలాగనీ పూటకో గ్లాసు పాలు ఏం ఇవ్వరు. పిల్లలకు ఉగ్గుపాలు పట్టినట్లు.. ఓ చెంచా పాలు ఇస్తారు అంతే. ద్వారకాతిరుమలలో గాడిద పాలు ఈ లెక్కన అమ్ముతున్నారు. ఈ పాలు.. ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గుకు మంచి మందని ప్రచారం ఉంది. అందుకే అంత రేటు అనమాట.

వామ్మో.. ఎంత మంచిదైనా..ఎన్ని రోగాలకు నయం చేసినా.. చెంచా పాలు మూడొందలు అంటే? మతి పోతుంది కదూ. అయితే ఆ పాలలో ఏవో మెడిసిన్ కలుపుతారట.. అందుకే అంత రేటు అని చెబుతుంది ఆ గాడిద పాలు అమ్మే మహిళ. పనిపాట లేనోళ్లను.. ఏం పనికి వస్తావ్‌రా.. కనీసం పోయి గాడుదులు కాసుకో అని పెద్దోళ్లు తిట్టేవాళ్లు.. చెప్తే వినకుండా ఊరిమీదపడి తిరిగేవాళ్లను.. ఏం తిరుగుడురా గాడిది తిరిగినట్టు.. అడ్డగాడది.. నిలువు గాడిదీ.. అని తిట్టేవాళ్లు.. కానీ గాడిద పాలకున్న డిమాండ్ చూస్తుంటే.. తమను అడ్డం బెట్టుకుని తిడుతుంటే గాడిదలు కూడా ఫీలయ్యే చాన్స్ ఉంది కదా…!

వీడియో దిగువన చూడండి… 

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!