Anupama Parameswaran: ఆ ఒక్క ఫోటో ఈ అమ్మడి కెరీర్‌ను మార్చిసిందట.. ఆసక్తికర విషయం చెప్పిన అనుపమ

|

Aug 27, 2022 | 6:21 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అందాల అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran: ఆ ఒక్క ఫోటో ఈ అమ్మడి కెరీర్‌ను మార్చిసిందట.. ఆసక్తికర విషయం చెప్పిన అనుపమ
Anupama Parameswaran
Follow us on

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ”అఆ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అందాల అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). ఈ మలయాళ ముద్దుగుమ్మ అంతకు ముందు ప్రేమమ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక అదే సినిమా తెలుగులో రీమేక్ అవ్వగా అందులోనూ అనుపమ నటించింది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో ఈ చిన్నది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాణిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ భామ రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. తాజాగా ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది అనుపమ పరమేశ్వరన్.. తన పద్దెనమిదో ఏటన ప్రేమమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు 19 కాగా.. మరో రెండు లైన్ లో ఉన్నాయి.

తాజాగా అనుపమ మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. తన స్నేహితురాలు సరదాగా ఆడిషన్స్ కు పంపిన ఫొటోతో తనకు సినిమా ఛాన్స్ వచ్చిందట. అనుపమ ఫోటో చూసిన ప్రేమమ్ దర్శకుడు ఆమెను తన సినిమాకోసం ఎంపిక చేసుకున్నారట. అయితే తెలుగులో ప్రేమమ్ మూవీలో తనను ఆదరించిన ప్రేక్షకులు.. శతమానం భవతి మూవీతో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారని తెలిపింది. ఇక కెరీర్ లో నిలిచిపోయే మూవీగా కార్తికేయ 2 నిలిచిందని.. ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే నిఖిల్ సరసన మరో సినిమా చేస్తోంది అనుపమ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.