
ప్రస్తుతం హీరోయిన్స్ కేవలం గ్లామర్స్ పాత్రలకే కాదు.. కంటెంట్ గురించి ఆలోచిస్తున్నారు. స్టోరీ బాగుంటే.. అందులో తమ పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు సిద్ధపడుతుంటారు. ముఖ్యంగా తమ ఫిట్ నెస్ మార్పు.. అంటే బరువు పెరిగే, తగ్గే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. గతంలో సైజ్ జీరో సినిమా కోసం అనుష్క శెట్టి లావుగా మారి షాకిచ్చింది. ఆ తర్వాత వెంటనే సన్నగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల నివేదా థామస్ సైతం ఎంతో లావుగా కనిపించింది. శాకిని డాకిని సినిమా ప్రమోషన్లో తన లుక్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. తాజాగా హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ సైతం తన లేటేస్ట్ ఫోటోతో అభిమానులను ఆశ్చర్యపరిచింది.
తాజాగా అను తన ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ వైరలవుతుంది. పట్టుచీర కట్టుకుని.. ఫోటోలకు స్టిల్ ఇస్తూ కనిపిచింది అను. అందులో చాలా సన్నగా అయిపోయి.. గుర్తుపట్టడానికి వీలు కాకుండా ఉంది. ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నాయి. ఆమె హెల్త్ బాగుందా ?.. మరీ ఇంతలా మారిపోయిందేంటీ ?.. ఆఫర్స్ కోసం డైట్ ప్లాన్ చేస్తూ.. మరీ ప్లాణాల మీదకు తెచ్చుకుంటుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన లేటేస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ను విస్మయానికి గురిచేసింది అను.
ఇటీవల అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో..రాక్షసివో చిత్రంలో కనిపించింది అను. ఈ మూవీ ప్రమోషన్లకు ముందు అను, శిరీష్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమే అని..ప్రేమ కాదంటూ క్లారిటీ ఇచ్చింది అను.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.