AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comedian Ali: కడుపులో బిడ్డతో సహా మంటల్లో కాలిపోయింది.. నా కూతురుకు ఆమె పేరే పెట్టుకున్నా.. అలీ ఎమోషనల్‌

పలు టీవీ షోలకు హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా ఓ ప్రముఖ ఛానెల్‌లో తాను హోస్ట్‌ చేస్తోన్న అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్‌కు కొన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చాడు అలీ.

Comedian Ali: కడుపులో బిడ్డతో సహా మంటల్లో కాలిపోయింది.. నా కూతురుకు ఆమె పేరే పెట్టుకున్నా.. అలీ ఎమోషనల్‌
Comedian Ali Daughter
Basha Shek
|

Updated on: Dec 21, 2022 | 5:29 PM

Share

బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అలీ. ఆతర్వాత కమెడియన్‌గా, హీరోగా సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. పలు టీవీ షోలకు హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా ఓ ప్రముఖ ఛానెల్‌లో తాను హోస్ట్‌ చేస్తోన్న అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్‌కు కొన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చాడు అలీ. ఈ సందర్భంగా నిర్వహించిన స్పెషల్‌ ఎపిసోడ్‌లో అలీ గెస్టుగా వచ్చారు. ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చాడు అలీ. అదేవిధంగా తన సోదరిని తలుచుకుని ఎమోషనల్‌ అయ్యాడు. ‘నా ఎనిమిదేళ్ల వయసులో అనుకుంటా.. మా పెద్దక్క ఫాతిమా ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయింది. అప్పటికే ఆమెకు ఒక బాబు పుట్టాడు. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పిల్లాడికి పాలు వేడి చేసింది. పాలు గ్లాసులో పోసేటప్పుడు చున్నీని వెనకేసుకోగా దానికి మంటలందుకున్నాయి. ఆమె దానిని గమనించలేదు. అలా ఆ మంటలు తన శరీరమంతా వ్యాపించాయి. ఇంట్లో నుంచి అలానే బయటకు రావడంతో అక్కడున్నవాళ్లు చూసి ఆమెపై నీళ్లు గుమ్మరించారు’

‘ దురదృష్టవశాత్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్క ప్రాణాలు దక్కలేదు. కడుపులో ఉన్న బిడ్డతో పాటు ఆమె కూడా చనిపోయింది. చిన్నప్పుడు అక్క నా మీద చాలా ప్రేమ చూపించేది. నేను పొద్దున్నే నిద్ర లేవకపోతే తనే కేర్‌ తీసుకుని మరీ నన్ను నిద్ర లేపేది. రెడీ చేసి షూటింగ్‌కు పంపేది. ఆ సంఘటన నుంచి మేమంతా కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అక్కయ్య మీదున్న అభిమానంతోనే నా పెద్ద కూతురుకు ఫాతిమా అని పేరు పెట్టుకున్నా’ అని చెప్పుకొచ్చాడు అలీ. కాగా ఇటీవల తన కూతురు ఫాతిమాకు గ్రాండ్‌గా పెళ్లి చేశాడీ స్టార్‌ కమెడియన్‌. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఏపీ సీఎం జగన్మోహర్‌ రెడ్డి కూడా రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా గత కొన్నేళ్లుగా వైసీపీ పార్టీలో కొనసాగుతోన్న అలీ ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..