Balakrishna – Boyapati Sreenu: బాలయ్య – బోయపాటి కాంబోలో మరో సినిమా రానుందా..?

|

Dec 10, 2021 | 3:27 PM

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అదసరం లేదు. ఈ ఇద్దరి కంబోలో ఇప్పటివరకు సింహ, లెజెండ్ రీసెంట్ గా అఖండ

Balakrishna - Boyapati Sreenu: బాలయ్య - బోయపాటి కాంబోలో మరో సినిమా రానుందా..?
Balakrishna
Follow us on

Balakrishna – Boyapati Sreenu: బాలయ్య – బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటివరకు సింహ, లెజెండ్ రీసెంట్‌గా అఖండ ఇలా మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అఖండ సినిమా అయితే అంచనాలకు మించి ఘనవజయాన్ని నమోదు చేసుకోని దుసుకుపోతుంది. కరోనా తర్వాత వచ్చిన పెద్ద సినిమా అవ్వడం..పైగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక అఖండ సినిమా భారీ విజయాన్ని సోంతం చేసుకోని విడుదలైన అన్నీ ఎరియాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
ఇదిలా వుంటే ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరోసినిమా చేయనున్నారని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల జరిగిన అంఖండ సక్సెస్ మీట్ లో బోయపాటి మాట్లాడుతూ.. బాలయ్యతో ఒక్క సినిమా చేస్తే చాలు అని చాలామంది ఎదురుచూస్తుంటారు.. అలాంటిది తనకు మూడు సినిమాలు చేసే అవకాశం దక్కిందని చెప్పుకోచ్చారు. అయితే ఈ క్రమంలో ప్రేక్షకుల నుంచి మరో సినిమా ఉంటుందా..? అని ప్రశ్నరావడంతో.. బోయపాటి స్పందిస్తూ తప్పకుండా.. ఆయనతో సినిమా తప్పకుండా చేస్తా అంటూ సమాదానం ఇచ్చారు. దాంతో బాలయ్య- బోయపాటి కాంబోలో మరో సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ ఇద్దరికాంబినేషన్ లో ఈసారి ఎలాంటి సినిమా వస్తుందో చూడలి. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పవర్ ఫుల్ కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రుతీహాసన్ నటిస్తుంది.ఈ సినిమా తర్వత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు బాలయ్య.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!