Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో అలాంటి సినిమా తీస్తా.. మనసులో మాట బయట పెట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి
డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమా ఏకంగా రూ. 600 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. ఓవైపు విమర్శలు, ట్రోల్స్ వస్తున్నప్పటికీ థియేటర్లలో సందీప్ రెడ్డి సినిమా దూకుడు మాత్రం ఆగడం లేదు. తాజాగా యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా అమెరికా వెళ్లారు సందీప్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన తర్వాతి ప్రాజెక్ట్స్‌లపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరిది. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఇదే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. కబీర్ సింగ్‌తో హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాడు. ఇప్పుడే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్‌తో యానిమల్ సినిమా తీసి మరోసారి అందరి నోళ్లలో నానుతున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమా ఏకంగా రూ. 600 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. ఓవైపు విమర్శలు, ట్రోల్స్ వస్తున్నప్పటికీ థియేటర్లలో సందీప్ రెడ్డి సినిమా దూకుడు మాత్రం ఆగడం లేదు. తాజాగా యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా అమెరికా వెళ్లారు సందీప్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన తర్వాతి ప్రాజెక్ట్స్‌లపై ఆసక్తికర కామెంట్లు చేశారు. అవకాశమొస్తే మెగాస్టార్ చిరంజీవితో కచ్చితంగా ఓ సినిమా చేస్తానన్నారీ సెన్సేషనల్ డైరెక్టర్. ‘చాలామంది లాగే నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఛాన్స్ వస్తే తప్పకుండా ఆయనతో ఓ యాక్షన్ డ్రామా చేయాలని ఉంది’ అని తన మనసులోని మాటను బయట పెట్టాడు సందీప్ రెడ్డి. దీంతో మెగా అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. త్వరగా తమ హీరోతో మంచి యాక్షన్ సినిమా తీయాలంటూ సందీప్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు.
యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కు జోడీగా రష్మిక మందన్నా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ రణ్‌బీర్ తండ్రిగా, బాబీ డియోల్ విలన్‌గా మెప్పించారు. అల్లు అర్జున్, డైరెక్టర్ ఆర్జీవీ, రేణు దేశాయ్, మహేశ్ బాబు, హరీశ్ శంకర్ తదితర ప్రముఖులు యానిమల్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో కొందరు యానిమల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. హింస ఎక్కువైందంటూ పెదవి విరిచారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ కూడా ఉండనున్నట్లు మూవీ చివర్లో ఇప్పటికే హింట్ ఇచ్చారు మేకర్స్ .అయితే అంతకు ముందు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ తీయనున్నారు సందీప్ రెడ్డి. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
600 కోట్ల క్లబ్ లో యానిమల్
Is there any chance of getting #Brahmanandam garu on board for #AnimalPark ? @imvangasandeep sir 🤔 #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins https://t.co/8Ux32A7RnU
— Animal The Film (@AnimalTheFilm) December 9, 2023
The Blockbuster’s Triumph continues 🪓
Book your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/F65Wrnn63c
— Animal The Film (@AnimalTheFilm) December 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.