Tripti Dimri: ‘కాబోయే వాడు అలా ఉంటే చాలు’.. పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ‘యానిమల్’ హీరోయిన్..
ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రి. యానిమల్ సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. రష్మిక కంటే ఎక్కువగా పాపులారిటిని సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు ఒక్కసారిగా మారుమోగింది. అంతేకాకుండా ఇన్ స్టాలో త్రిప్తి డిమ్రి పాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. యానిమల్ ఎఫెక్ట్ తో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రి. యానిమల్ సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. రష్మిక కంటే ఎక్కువగా పాపులారిటిని సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు ఒక్కసారిగా మారుమోగింది. అంతేకాకుండా ఇన్ స్టాలో త్రిప్తి డిమ్రి పాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. యానిమల్ ఎఫెక్ట్ తో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
అలాగే పెళ్లి ప్లాన్స్ ఎప్పుడు చేస్తున్నారని అడగ్గా.. త్రిప్తి మాట్లాడుతూ..ఇప్పటికిప్పుడు నా పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని.. ప్రస్తుతం తన కెరీర్ పైనే దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అలాగే కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారని అడిగితే.. మంచి వ్యక్తి అయితే చాలని.. అదొక్కటే కోరుకుంటున్నానని.. మంచిగా ఉంటే.. డబ్బు, పేరు వాటంతట అవే వస్తాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. 2012లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది త్రిప్తి. హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ యానిమల్ సినిమాతోనే ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది.
View this post on Instagram
గతంలో ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్ తో త్రిప్తి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరు తమ ప్రేమ గురించి అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె ‘మేరే మెహబూబ్ మేరే సనమ్’లో నటిస్తుంది. ఇందులో విక్కీ కౌశల్, అమీ విర్క్‌లతో పాటు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ‘ఆషికి 3’ కోసం సైన్ అప్ చేసినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




