Anchor Varshini: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న అందాల యాంకర్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

|

Oct 02, 2022 | 7:57 AM

పలు టీవీషోలో యాంకర్ గా చేసిన వర్షిణి.. హీరోయిన్ గాను ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచుకోలేకపోయింది వర్షిణి.

Anchor Varshini: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న అందాల యాంకర్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Anchor Varshini
Follow us on

టెలివిజన్ లో చాలా మంది స్టార్ యాంకర్స్ గా రాణిస్తున్న వయ్యారి భామలో వర్షిణి ఒకరు. తనదైన చలాకీతనంతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. పలు టీవీషోలో యాంకర్ గా చేసిన వర్షిణి.. హీరోయిన్ గాను ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచుకోలేకపోయింది వర్షిణి. అయితే తనదైన అందంతో ఆకట్టుకున్న వర్షిణి త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. వెండితెరపై ఏమాత్రం గుర్తింపు రాకపోయినా.. బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ అమ్మడు బుల్లితెర పై కూడా పెద్దగా కనిపించడం లేదు.

వర్షిని వెండితెరపై బుల్లితెరకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటుంది. రోజూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ.. అలాగే తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ. అయితే సోషల్ మీడియాలో అందాలు ఒలకబోసిన ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో వర్షిణి పెళ్లిపీటలెక్కలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.

పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని నిర్ణయించుకుందట వర్షిణి. అయితే వర్షిణి పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరో కాదు. తనకు వరుసకు బావయే వ్యక్తితో  ఈ బ్యూటీ పెళ్లిపీటలెక్కనుందని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి వీరి తల్లిదండ్రులు వీరిద్దరికీ పెళ్లి చేయాలని కూడా భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్షిణి తన బావతో కలిసి ఏడు అడుగులు వేయనుందని అంటున్నారు. త్వరలోనే వర్షిణి పెళ్లి కి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి


మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..