Mowgli Movie Twitter Review: మోగ్లీ ట్విట్టర్ రివ్యూ.. యాంకర్ సుమ కొడుకు సినిమా ఎలా ఉందంటే.. ?

యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బబుల్ గమ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రోషన్.. ఇప్పుడు మోగ్లీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 13న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Mowgli Movie Twitter Review: మోగ్లీ ట్విట్టర్ రివ్యూ.. యాంకర్ సుమ కొడుకు సినిమా ఎలా ఉందంటే.. ?
Mowgli Movie

Updated on: Dec 13, 2025 | 9:06 AM

కలర్ ఫోటో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్. షార్ట్ ఫిల్స్మ్ తెరకెక్కిస్తూ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందీప్.. కలర్ ఫోటో మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మోగ్లీ సినిమాను తెరకెక్కించారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు. ఇందులో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించగా.. బండి సరోజ్ కుమార్ విలన్ పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 13న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోలు చూసిన అడియన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయలను తెలియజేస్తున్నారు. ఈ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రోషన్ యాక్టింగ్ అదరగొట్టేశాడని.. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్, సాంగ్స్ బాగున్నాయని.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..