‘రాములో రాములా’ పాట‌కు సుమ‌క్క స్టెప్పులు..చూడాల్సిందే సుమీ..!

యాంకర్ సుమ..బుల్లి తెర లేడీ సూప‌ర్ స్టార్ అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎప్పుడూ టీ షోలు, ఆడియో, ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ల‌తో బిజీగా ఉండే ఈ స్టార్ కు..తాజా లాక్ డౌన్ తో ఊహించ‌నంత టైమ్ స్పైస్ దొరికింది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా సుమ చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

'రాములో రాములా' పాట‌కు సుమ‌క్క స్టెప్పులు..చూడాల్సిందే సుమీ..!
Follow us

|

Updated on: Jun 07, 2020 | 8:49 AM

యాంకర్ సుమ..బుల్లి తెర లేడీ సూప‌ర్ స్టార్ అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎప్పుడూ టీవీ షోలు, ఆడియో, ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ల‌తో బిజీగా ఉండే ఈ స్టార్ కు..తాజా లాక్ డౌన్ తో ఊహించ‌నంత టైమ్ స్పైస్ దొరికింది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా సుమ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్ డేట్స్ నెటిజ‌న్ల‌తో పంచుకుంటూ ఉంటుంది. త‌నకు తెలిసిన హెల్త్ టిప్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో కూడా తోటి యాంకర్స్ అందరితో కలిసి ఎంట‌ర్టైన్మెంట్ ప్రొగ్రామ్ చేస్తోంది సుమ‌. ఇక ఇప్పుడు ఏకంగా డ్యాన్సులు మొద‌లెట్టేసింది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పురములో’ సినిమాలోని రాములో రాములా పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది ఈ స్టార్ హోస్ట్. స‌ద‌రు వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సుమ పెట్ డాగ్ కూడా ఉంది.

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాములా’ సాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌లువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం ఈ పాటకు కాలు క‌దిపారు. ముఖ్యంగా టిక్ టాక్ లో ఈ పాట బాగా వైర‌ల‌య్యింది. ఇప్పుడు సుమక్క‌ కూడా బన్నీ పాటకు డాన్స్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి,..