AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాల అనసూయకు అదిరిపోయే ఆఫర్ !

అనసూయ భరద్వాజ్..ప్రజంట్ తెలుగు బుల్లితెరపై మోస్ట్ బ్యూటీఫుల్ హోస్ట్ అన్న విషయం తెలిసిందే. వయసు పెరుగుతున్న కొద్దీ అనసూయ అందం కూడా రెట్టింపవుతుంది.

అందాల అనసూయకు అదిరిపోయే ఆఫర్ !
ఇక పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరిసి తన అందంతో కట్టిపడేసింది. 
Ram Naramaneni
|

Updated on: Sep 17, 2020 | 11:10 AM

Share

అనసూయ భరద్వాజ్..ప్రజంట్ తెలుగు బుల్లితెరపై మోస్ట్ బ్యూటీఫుల్ హోస్ట్ అన్న విషయం తెలిసిందే. వయసు పెరుగుతున్న కొద్దీ అనసూయ అందం కూడా రెట్టింపవుతుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఫేమ్ తెచ్చుకున్న ఈ స్టార్ యాంకర్, సినిమాల్లో కూడా నటిస్తూ అదరగొడుతుంది. ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఈ ముద్దుగుమ్మ నటనకు ఫిదా అయిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ.. తన తదుపరి సినిమా ‘రంగ మార్తండ’లో అవకాశం ఇచ్చారని సమాచారం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ, బ్రహ్మనందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘నటసామ్రాట్’ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఒరిజినల్ సినిమాలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ఒక స్పెషల్ రోల్ కోసం అనసూయని తీసుకున్నారట.

ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందని టాక్. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే పాత్రలో కనిపించనుందట. అంతేకాదు కథానుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నర్తించాల్సి ఉంటుందట. కృష్ణవంశీ పాత్రలను, పాటలను ఎలా డిజైన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో అనసూయ మరింత క్రేజ్ సంపాదించడం ఖాయం  అంటున్నారు సినీ జనాలు.  కాగా ‘రంగ మార్తండ’లో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కారణంగా వాయిదా పడింది.  ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో  అతి త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

Follow Us
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ