Anasuya Bharadwaj: నాకూ ఓ ఫ్యామిలీ ఉంది.. దయచేసి నన్ను వదిలేయండి.. అనసూయ షాకింగ్‌ ట్వీట్స్‌

|

Jun 19, 2023 | 5:14 PM

ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఇప్పుడు బుల్లితెరపై కంటే వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తోంది. రంగస్థలం, పుష్ప, రంగమార్తాండ సినిమాలతో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ అందాల తార ఇటీవల విమానం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anasuya Bharadwaj: నాకూ ఓ ఫ్యామిలీ ఉంది.. దయచేసి నన్ను వదిలేయండి.. అనసూయ షాకింగ్‌ ట్వీట్స్‌
Anasuya Bharadwaj
Follow us on

ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఇప్పుడు బుల్లితెరపై కంటే వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తోంది. రంగస్థలం, పుష్ప, రంగమార్తాండ సినిమాలతో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ అందాల తార ఇటీవల విమానం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనసూయ పోషించిన సుమతి పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల అనసూయ పేరు ఎక్కువగా నెట్టింట బాగా వినిపిస్తోంది. కొన్ని రోజుల ముందు హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశిస్తూ ఆమె షేర్‌ చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఖుషి సినిమా పోస్టర్‌లో హీరో పేరు ముందు ‘THE’ తప్పు పడుతూ అనసూయ ట్వీట్‌ చేయడం, దీనికి కౌంటర్లు, ప్రతి కౌంటర్లు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. ఇక ఓ ఇంటర్వ్యూలో విజయ దేవర కొండ దగ్గర పని చేసే ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి మరీ తనపై ట్రోలింగ్‌ చేయిస్తున్నాడంటూ అనసూయ కామెంట్లు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే విజయ్‌ దేవరకొండ తనకు మంచి స్నేహితుడన్న ఆమె ఇకపై అతనిపై కామెంట్లు చేయనంది. అలాగే గొడవలు, వివాదాలకు దూరంగా ఉంటానంది. తాజాగా మరోసారి ఈ విషయంపై నోరు విప్పింది అనసూయ. తనకు ఓ ఫ్యామిలీ ఉంది. తనను వదిలేయండంటూ ట్విట్టర్‌ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్‌ చేసింది.

‘అందరికి నమస్కారం. గత కొన్ని రోజులుగా నాకు చాలా ట్వీట్లు వస్తున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను అగౌరవపరిచేందుకు నా పేరును వాడుకుంటున్నారు. ఇలా చేస్తున్నందుకు నాకు చాలా అమర్యాదగా, అగౌరవంగా ఉంది. ఇది నా పేరును కించపరిచేలా ఉంది. వీటితో నాకెలాంటి సంబంధం లేదు. ఇది అనవసరమైన బాధను కలిగిస్తోంది. ఇది నా లైఫ్‌. నాకు నచ్చిన విధంగా లీడ్‌ చేస్తున్నా. అలాగే నేను ఎవరి జోలికి వెళ్లాలనుకోవడం లేదు. నేను నా స్వశక్తితో ఎదిగిన ఒక మహిళని. నా గురించి గొప్పగా చెప్పేందుకు నాకు ప్రత్యేకంగా పీఆర్‌ టీమ్స్‌ లేవు. మీరు నన్ను ఎంకరేజ్‌ చేయడం ఇష్టం లేకపోతే కనీసం నా నుంచి దూరంగా ఉండండి. నాకు సంబంధం లేని విషయాల్లోకి నా పేరును లాగకండి. అలా చేయకుండా ఉండేందుకు తగినంత దయ చూపించండి. కాస్త మనుషుల్లా ప్రవర్తించండి ప్లీజ్‌. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. దయచేసి ఇక ఆపేయండి’ అని రిక్వెస్ట్‌ చేసింది అనసూయ. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..